Begin typing your search above and press return to search.

రాహుల్‌ కు థ్యాంక్స్ చెప్పిన నిర్భ‌య త‌ల్లి!

By:  Tupaki Desk   |   2 Nov 2017 7:24 AM GMT
రాహుల్‌ కు థ్యాంక్స్ చెప్పిన నిర్భ‌య త‌ల్లి!
X
యావ‌త్ దేశాన్ని కుదిపేసిన పారా మెడిక‌ల్ స్టూడెంట్ నిర్భ‌య అత్యాచార ఉదంతం సంగతి తెలిసిందే. అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన ఉదంతంలో నిర్భ‌య మృత్యుదేవ‌త‌తో పోరాడి ఓడిపోయింది. దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఉదంతం అనంత‌రం.. మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల‌కుపాల్ప‌డే మృగాళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌ల కోసం నిర్భ‌య చ‌ట్టాన్ని కూడా రూపొందించారు.

త‌న కుమార్తెకు జ‌రిగిన అన్యాయం మ‌రెవ‌రికీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని.. మ‌రే పేరెంట్స్ కు అలాంటి మానసిక క్షోభ పడ‌కూదంటూ ఉద్య‌మించారు కూడా. దేశరాజ‌ధానిలో చోటు చేసుకున్న ఈ ఆరాచ‌క ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన నిందితుల‌కు సుప్రీం మ‌ర‌ణ‌శిక్ష విధించింది. ఇదిలా ఉంటే.. నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి తాజాగా కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు.

రాహుల్ ప్ర‌స్తావ‌నను నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి ఎందుకు తీసుకొచ్చారంటే.. దానికి ప్ర‌త్యేక కార‌ణం లేక‌పోలేదు. ఆశాదేవి కుమారుడు తాజాగా భార‌త నేవీకి ఎంపిక‌య్యారు. అందుకు రాహుల్ అందించిన ప్రోత్సాహ‌మే కార‌ణంగా ఆమె చెబుతున్నారు. నిర్భ‌య ఉదంతం చోటు చేసుకున్న త‌ర్వాత త‌న కొడుకు కుంగిపోయాడ‌ని.. చ‌దువు మీద దృష్టి సారించ‌లేద‌న్న ఆమె.. ఆ స‌మ‌యంలో రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పార‌న్నారు.

సాధించాల్సింది ఎంతో ఉంద‌ని స్ఫూర్తి క‌లిగించేలా మాట్లాడ‌ట‌మే కాదు.. దాదాపుగా ప్ర‌తిరోజూ మాట్లాడేవార‌న్నారు. 2013లో సీబీఎస్‌ సీ ప‌రీక్ష‌లు అయిపోయిన వెంట‌నే రాయ్ బ‌రేలీలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ అర్బ‌న్ అకాడ‌మీలో సీటు రావ‌టంతో వారి కుటుంబం అక్క‌డకు మారింది. ఈ స‌మ‌యంలో రాహుల్ సూచ‌న మేర‌కు త‌న కొడుకు పైలెట్ ట్రెయినింగ్ కోర్సు తీసుకొని లక్ష్యాన్ని సాధించాడ‌న్నారు. ప్ర‌తి రోజూ దాదాపుగా త‌న కొడుకుతో రాహుల్ మాట్లాడేవార‌న్న ఆమె.. రాహుల్ సోద‌రి ప్రియాంకవాద్రా కూడా మాట్లాడేవార‌న్నారు. జీవితంలో వెన‌క‌డుకు వేయొద్ద‌ని చెప్ప‌టేమ‌కాదు.. ముందుకు సాగాల‌ని ధైర్యం చెప్పేవార‌ట‌.

పైలెట్ కోర్సును విజ‌య‌వంతంగా పూర్తి చేసిన త‌న కుమారుడికి ఇప్పుడు గుర్ గ్రామ్ ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీలో చోటు ల‌భించింద‌ని.. త‌న కొడుకు ఇప్పుడీ స్థాయిలో చేరారంటే అందుకు రాహుల్ కార‌ణంగా ఆమె వెల్ల‌డించారు. గతానికి భిన్నంగా ఇటీవ‌ల కాలంలో రాహుల్ మీద సానుకూల‌త పెరిగే ప‌రిణామాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మొన్న‌టికి మాన్న త‌న‌కొచ్చిన మార్షల్ ఆర్ట్స్ గురించి రాహుల్ సంద‌ర్భోచితంగా చెప్ప‌టంతో కొత్త త‌ర‌హా ఇమేజ్ రాహుల్ సొంత‌మైంది. తాజాగా నిర్భ‌య త‌ల్లి వెల్ల‌డించిన విష‌యాలు రాహుల్ ఇమేజ్ ను మ‌రింత పెంచుతాయ‌న‌టంలో సందేహం లేదు.