Begin typing your search above and press return to search.

సుష్మా స్పంద‌నపై పాక్ వాసులు సంతోషం

By:  Tupaki Desk   |   15 Dec 2017 9:46 AM GMT
సుష్మా స్పంద‌నపై పాక్ వాసులు సంతోషం
X
సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉండ‌ట‌మే కాదు స‌మ‌స్య‌ల ప‌ట్ల మాన‌వ‌తా దృక్ప‌థంతో స్పందించే విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ మ‌రో రికార్డు సృష్టించారు. బీజేపీ సిద్ధాంతాల‌ను బ‌లంగా న‌మ్మి పాటించ‌డ‌మే కాకుండా... సేవాగుణం ఉట్టిప‌డ్డ నాయ‌కుల్లో సుష్మాస్వ‌రాజ్ ప్ర‌ముఖ‌మైన వ్య‌క్తి అనే సంగ‌తి తెలిసిందే. పాత త‌రం నాయ‌కురాలు అయిన‌ప్ప‌టికీ మారుతున్న కాలానికి త‌గిన‌ట్లు ఆమె సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకున్నారు. సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉండ‌ట‌మే కాదు స‌మ‌స్య‌ల ప‌ట్ల మాన‌వ‌తా దృక్ప‌థంతో స్పందించే విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ తాజాగా మరో రికార్డు సృష్టించారు. దాయాది దేశమైన పాకిస్తాన్ వాసుల‌కు ఒక‌రికి కాదు ఇద్ద‌రికి కాదు ఏకంగా ఐదుగురికి ప్రాణం పోసే నిర్ణయం తీసుకున్నారు.

చికిత్స కోసం ఐదుగురు చిన్నారులకు మెడికల్ వీసా మంజూరు చేశామని విదేశాంగ అధికారుల‌ను సంప్ర‌దించ‌గా...ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. దీంతో వారు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ కు తమ సమ‌స్య‌ను విన్న‌విస్తూ ట్వీట్ చేశారు. పాకిస్థాన్‌ కు చెందిన మహ్మద్ అహ్మద్ (10నెలలు) - అబుజర్ (7 ఏళ్లు) - జైనాబ్ షాహ్‌జాదీ (8ఏళ్లు) - మహ్మద్ జైన్ అస్లామ్ ( 9 ఏళ్లు) - మోహిత్ (7 ఏళ్లు)భారత్‌ లో వైద్య చికిత్స కోసం మెడికల్ వీసా ఇవ్వాలని సుష్మ‌ను కోరారు. వీరిలో 10 నెలల చిన్నారి కూడా ఉంది. దీంతో వైద్యం కోసం భారత్‌ కు వచ్చేందుకు ఐదుగురు పాకిస్థాన్ చిన్నారులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వాల‌ని సుష్మ సూచించారు.

దీంతో ఈ చిన్నారుల‌తో పాటుగా అల్తాఫ్ హుస్సేన్ - అమీర్‌ రాజా అనే మరో ఇద్దరు పాకిస్థాయులకు కూడా మెడికల్ వీసా ఇచ్చినట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇదే విష‌యాన్ని సుష్మా ట్వీట్ చేశారు. పాక్‌ లోని భారత హైకమిషన్ అనుమ‌తి ఇచ్చిన వారిలో చిన్నారుల‌తో పాటు తన తండ్రి కిడ్నీ మార్పిడి చికిత్సకోసం భారత్ వస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయి..అతని తండ్రి త్వరగా కోలుకోవాలని సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. కాగా, సుష్మా స్పంద‌నపై పాక్ వాసులు సంతోషం వ్య‌క్తం చేశారు. కేంద్ర మంత్రి ఇంత ఉదారంగా స్పందిస్తార‌ని తాము అనుకోలేద‌ని ప‌లు ట్వీట్ల‌లో వెల్ల‌డించారు.

కాగా, గ‌తంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పై ఓ పాకిస్తానీ మహిళ ప్రశంసల వర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఆమె మా ప్రధాని అయిఉంటే తమ దేశం ఎప్పుడో బాగుపడి ఉండేదంటూ కొనియాడింది. పాకిస్తాన్ కు చెందిన హిజాబ్‌ అసీఫ్‌ అనే మహిళ కాలేయ సమస్యతో బాధపడుతోంది. వెంటనే ఆమె భారత్‌లో చికిత్స చేయించుకోవాల్సి ఉంది. ఇందుకోసం హిజాబ్‌ మెడికల్‌ వీసా కోసం ఇస్లామాబాద్‌ లోని డిప్యూటీ హైకమిషనర్‌ ను ఆశ్రయించింది. కానీ ఇందుకు కమిషనర్‌ ఒప్పుకోలేదు. ఈ విష‌యంలో హిజాబ్‌ సుష్మా స్వరాజ్‌ ను ఆశ్రయించింది. ‘మేడమ్‌.. నాకు కాలేయ సమస్య ఉంది. భారత్‌ లో చికిత్స చేయించుకోవాలి. మెడికల్‌ వీసా కావాలని అడిగితే అది మీరే చూసుకోవాలని అంటున్నారు. నాకు సాయం చేయండి’ అని ట్వీట్‌ చేసింది. ఎప్పటిలాగే వెంటనే స్పందించిన సుష్మా.. మెడికల్‌ వీసా వచ్చేలా డిప్యూటీ హైకమిషనర్‌ ను ట్విటర్‌ లో ఆదేశించింది. సుష్మా ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాల మీద వీసా మంజూరు చేశారు. ఈ సంద‌ర్భంగానే ఆమె త‌మ దేశానికి ప్ర‌ధాని అయితే బాగుండేద‌ని ఆకాంక్షించారు.