Begin typing your search above and press return to search.

ప్రస్తుత రాజకీయాల పై తళపతి విజయ్ సెన్సేషనల్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   17 Jun 2023 8:00 PM GMT
ప్రస్తుత రాజకీయాల పై తళపతి విజయ్ సెన్సేషనల్  కామెంట్స్!
X
గతకొన్ని రోజులుగా తమిళ సూపర్ స్టార్ తళపతి విజయ్ రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన అభిమానులతో కలిసి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తునారని.. యువతను లక్ష్యంగా చేసుకుని మెరుగైన రాజకీయాలకు పునాదులు వేయబోతున్నారని రకరకాల కథనాలు తమిళ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాలపై తళపతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చెన్నైలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌ లో విద్యార్థులతో సమావేశమైన హీరో విజయ్.. "మీరే కాబోయే ఓటర్లు.. మీరే మంచి మంచి లీడర్లను రాబోయే కాలంలో ఎన్నుకోబోతున్నారు" అంటూ విద్యార్థుల్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఒక ఓటుకి రూ.1000 చొప్పున లక్షన్నర మందికి రూ.15 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే.. దాని ముందు ఓ రాజకీయ నాయకుడు ఎంత సంపాదించి ఉంటాడో మీరే ఆలోచించుకోండని విద్యార్థులకు సూచించాడు.

ఇలాంటి విషయాలన్నీ.. విద్యావ్యవస్థలో పాఠ్యాంశాలుగా చెప్పాలని కోరుకుంటున్నానని విజయ్ తెలిపారు. ఈసందర్భంగా ఇప్పుడే టెంత్స్, ట్వల్త్ పూర్తి చేసిన విద్యార్థులు వచ్చే ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్నారని.. డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలని మీ తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు హీరో విజయ్ సూచించాడు. మన కన్నుతో మనమే గుచ్చికున్నట్లుగా.. ఇప్పుడు రాజకీయాల పరిస్థితి తయారైందని చురకలంటించాడు. డబ్బు తీసుకుని ఓటు వేయడమే దీనికి సైరన ఉదాహరణ అని విజయ్ తెలిపాడు.

ఈ సమావేశంలో తనకు చెందిన "పీపుల్స్ మూవ్‌మెంట్" సంస్థ ద్వారా 10, 12వ తరగతుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు అందించాడు. ఈ సందర్భంగా... ధనుష్ హీరోగా నటించిన "అసురన్" (తెలుగులో వెంకటేష్ "నారప్ప" గా రీమేక్ చేశారు) సినిమాలోని... "మన దగ్గర భూమి ఉంటే తీసుకుంటారు.. డబ్బు ఉంటే లాగేసుకుంటారు.. కానీ, చదువు ఒక్కటే మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు" అనే డైలాగ్‌ ని విజయ్ ఈ సందర్భంగా ప్రస్థావించడం గమనార్హం.

ఈ సందర్భంగా విద్యార్థులు పాఠ్యపుస్తకాలతోపాటు అంబేద్కర్, పెరియార్, కామరాజర్ కు సంబంధించిన పుస్తకాలు చదువుతూ వారి గురించి తెలుసుకోవాలని సూచించారు. ప్రస్తుతం తమిళనాట విజయ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

కాగా, ఇటీవల వెలువడ్డ టెన్త్, ప్లస్‌–2 ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి పేరెంట్స్ తో సహా పిలిపించి, సత్కరించాలని విజయ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి టాపి త్రీ పేల్స్ లో నిలిచిన ముగ్గురిని ఎంపిక చేసి ఈరోజు అవార్డులు బహికరించారు.