Begin typing your search above and press return to search.
తెలుగు రాదు.. కానీ పాడు సైట్లు
By: Tupaki Desk | 8 Nov 2017 9:19 AM GMTపొట్ట కోస్తే తెలుగు అక్షరం ముక్క రాదు. కానీ.. తెలుగు భాషతో పాడు వెబ్ సైట్లు నిర్వహించే వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమా తారల గురించి ఇష్టం వచ్చినట్లుగా రాసేసే బ్యాచ్ మీద ఇటీవల కాలంలో పోలీస్ శాఖ దృష్టి సారించింది. దీనికి సంబంధించి తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి పాడు వెబ్ సైట్లపై దృష్టి సారించిన పోలీసులు తాజాగా కొందరిని అరెస్ట్ చేసింది.
తెలుగు ప్రముఖ సినీ తారల గురించి.. వారి ఫోటోలు.. వీడియోలను మార్ఫింగ్ చేయటం.. వాటిని సైట్లలో అప్ చేసి డబ్బులు సంపాదిస్తున్న వైనాన్ని గుర్తించారు.
నకిలీ వెబ్ సైట్లు.. అసభ్య వెబ్ సైట్ల గురించి మా అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం ఇలాంటి వెబ్ సైట్లు ఎవరు నిర్వహిస్తున్నారు? వారి వెనుక ఎవరు ఉన్నారు? అన్న అంశంపై దృష్టి పెట్టింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సీఐడీ సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ సందర్భంగా అహ్మాదాబాద్ కు చెందిన ఠాకూర్ మహేష్ కుమార్ జయంతీజీ.. ఠాకూర్ బాలూసిన్హాలు ఈ తరహాలో కొన్ని పాడు వెబ్ సైట్ల నిర్వహిస్తున్న నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ తారల సమాచారంతో వారి ఫోటోలు.. వీడియోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇలా వారు నిర్వహిస్తున్న వెబ్ సైట్లలో తెలుగు రానప్పటికీ.. వచ్చిన రీతిలో అప్ లోడ్ చేసేస్తున్న వైనాన్ని గుర్తించారు. ఇలా చేసిన దానికి నిందితులు ప్రతినెలా రూ.25 వేల నుంచి రూ.35 వేల మొత్తాన్ని సంపాదిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గుజరాత్ లో పట్టుకున్న నిందుతుల్ని అక్కడి కోర్టుల్లో హాజరుపరిచి అనంతరం వారిని హైదరాబాద్ తీసుకొచ్చారు. వీరి నుంచి సెల్ ఫోన్లు.. సిమ్ కార్డులు.. ల్యాఫ్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక.. వారు నిర్వహించే సైట్ల మీద కొరడా ఝుళిపించారు.