Begin typing your search above and press return to search.
థాయ్ నర్సు సెక్సీ డ్రెస్ ఎంత పనిచేసిందో?
By: Tupaki Desk | 25 May 2017 6:35 AM GMTసొసైటీలో కొన్ని వృత్తులకు ఉన్న గుర్తింపే వేరు. ఉపాధ్యాయులు, నర్సులు వంటివారికి సమాజంలో ఎంతో ఉన్నత స్థానం ఉంటుంది. అందుకు కారణం వారు సమాజంలో పోషించే పాత్రే కారణం. నర్సులు అంటే విసుగు, అసహ్యం లేకుండా రోగులకు సేవ చేసే మానవతామూర్తులు. అందుకే ప్రపంచంలోని ఏ దేశంలోనైనా వారిని సిస్టర్ అని సంబోధిస్తుంటారు. థాయిల్యాండ్ లో ఓ నర్సు తానెవరో మర్చిపోయి సెక్సీ డ్రెస్సుల్లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు మండిపడ్డారు. గౌరవ ప్రదంగా ఉండాల్సిన ఆమె రెచ్చగొట్టే వస్ర్తధారణలో వంపు సొంపులు చూపించడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో చివరకు ఆమెను ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ ఆసుపత్రి యాజమాన్యం ఫోర్సు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
థాయ్ నర్స్ లవర్స్ అసోసియేషన్ అనే సోషల్ మీడియాలో పేజీలో పాంగ్ చాట్స్రీ అనే నర్సు తన ప్రైవేటు ఫొటోలను షేర్ చేసింది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో సెక్సీ భంగిమల్లో ఆమె దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆమె తన వృత్తిని కించపరిచిందంటూ మండిపడ్డారు. దీంతో ఆమె పనిచేసే హాస్పిటల్ బోర్డు సభ్యులు ఆమెను రిజైన్ చేయమని ఒత్తిడి చేశారు.
వ్యవహారం తేడా కొట్టడంతో పాంగ్ కూడా వెంటనే క్షమాపణలు చెప్పింది. అంతేకాదు... తన ఫొటోలు చూసి నర్సుల పట్ల తప్పుడు అభిప్రాయం పెంచుకోవద్దని, తాను చేసింది తప్పేనని చెప్పింది. కాగా... నెట్లో హల్ చల్ చేసిన ఆ చిత్రాలు మరీ అంత అభ్యంతరకరంగా ఏమీ లేవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పాశ్చాత్య నర్సులు అలానే ఉంటారని అంటున్నారు. అయితే.. థాయిల్యాండ్ లో మాత్రం అలాంటి వస్ర్తధారణలో నర్సులు ఉండకపోవడంతో వ్యవహారం రచ్చరచ్చయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/