Begin typing your search above and press return to search.
వీర్యకణాలు స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు
By: Tupaki Desk | 21 April 2017 4:54 PM GMTఇదో చిత్రమైన వార్త. థాయిలాండ్ లోని నాంగ్ ఖాయి బోర్డర్ దగ్గర ఎప్పటిలాగే ఈ సారి కూడా ఓ ప్రయాణికుడు ఓ పెద్ద బ్యాగ్ వేసుకుని బోర్డర్ దాటాడు. కానీ ఈసారి చెక్ పాయింట్ దగ్గర కస్టమ్స్ అధికారులు అతన్ని ఆరాతీశారు. సందేహం వచ్చి అతని బ్యాగ్ ను చెక్ చేశారు. బ్యాగ్ తెరిచిన కస్టమ్స్ అధికారులు స్టన్ అయ్యారు. ఆ బ్యాగ్ లో పురుష వీర్య కణాలను స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు ఆ వ్యక్తి. ఈ ఘటన థాయిలాండ్ లో జరిగింది.
వీర్య కణాలను ట్యూబుల్లో అక్రమ సరఫరా చేస్తున్న థాయ్ వ్యక్తిని నితినన్ శ్రీతనియనన్ గా గుర్తించారు. పక్కనే ఉన్న లావోస్ తో పాటు కంబోడియా దేశాలకు నితినన్ దాదాపు 12 సార్లు వెళ్లాడు. అయితే ప్రతిసారీ అతను బ్యాగ్ తీసుకువెళ్తున్నా పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఈసారి ఎందుకో చెక్ చేయడంతో వాళ్లకు నితినన్ గుట్టు తెలిసిపోయింది. థాయిలాండ్ లో అద్దెగర్భాలకు అనుమతి లేదు. దీంతో అక్కడ సరోగసీ కష్టంగా మారింది. దీన్నే వ్యాపారంగా మలుచుకున్న నితినన్ చాలాసార్లు పురుష వీర్య కణాలు ఉన్న ట్యూబ్ లతో బోర్డర్ దాటాడు. చైనీస్ - వియత్నాం వ్యక్తుల వీర్య కణాలతో సరిహద్దు దాటుతున్నట్లు చివరకు నితినన్ అంగీకరించాడు. నైట్రోజన్ ఫ్రీజింగ్ ట్యాంక్ లో మొత్తం ఆరు వీర్య కణాల ట్యూబ్ లను తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. అయితే లావోస్, కంబోడియా దేశాల్లో చట్టపరంగా అద్దె గర్భాలకు అనుమతి ఉంది. థాయిలాండ్ లోని నాంగ్ ఖాయి బోర్డర్ దగ్గర వ్యక్తిని పట్టుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/