Begin typing your search above and press return to search.
చీకోటి అండ్ కో కు బెయిల్ ఇచ్చేసిన థాయ్ కోర్టు.. హైదరాబాద్ కు వచ్చేస్తున్నారు
By: Tupaki Desk | 3 May 2023 10:09 AM GMTక్యాసినో కింగ్ గా పేరున్న చీకోటి ప్రవీణ్ తో సహా ఆయన వెంట ఉన్న 84 మంది తెలుగు వారిని చట్టవిరుద్ధమైన గ్యాంబ్లింగ్ ఆడుతున్న వేళ.. థాయ్ లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. గ్యాంబ్లింగ్ ఆడటం కోసం ప్రత్యేకంగా థాయ్ లాండ్ కు వెళ్లిన వారిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేయటం సంచలనంగా మారింది. మరికొద్ది గంటల్లో థాయ్ లాండ్ నుంచి తిరిగి వచ్చేయటానికి కొన్ని గంటల ముందు చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామం పెను సంచలనంగా మారింది.
దీంతో.. పోలీసుల అదుపులో ఉన్న వారిపరిస్థితి ఏమిటి? వారికేం జరుగుతుందన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే.. తాము అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు ప్రశ్నించి.. వారిని కోర్టుకు హాజరుపర్చారు.
అదుపులోకి తీసుకున్న వారిని రెండు టీంలుగా చేసినట్లు తెలుస్తోంది. ఒక టీంలో నిర్వాహకులు.. గ్యాంబ్లింగ్ కు సంబంధించిన అంశాల్ని పర్యవేక్షించిన వారు కాగా.. రెండో వర్గంలో ఆడే వారిని వేర్వేరుగా ఉంచి.. వారి నుంచి వివరాల్నిసేకరించినట్లుగా చెబుతున్నారు.
అనంతరం ఈ రెండు గ్రూపుల్ని పట్టాయాలోని ప్రొవిన్షియల్ కోర్టులో హాజరు పర్చారు. ఈ సందర్భంగా అక్కడి న్యాయమూర్తి ఒక్కొక్కరికి 4500 బాత్ ల (మన రూపాయిల్లో రూ.10,790) కు వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేశారు.
అంతేకాదు.. పోలీసులు.. ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ.. నిందితుల్ని భారత్ కు తిప్పి పంపాలని.. వారి వీసాల్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. వాళ్లపై నిర్ణీత కాలం వరకు థాయ్ లాండ్ కు వచ్చేందుకు వీల్లేని రీతిలో బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో నిందితుల నుంచి తమకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నథాయ్ పోలీసులు.. 84 మంది తెలుగు వారిని హైదరాబాద్ కుపంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరంతా ఈ రోజు (బుధవారం) హైదరాబాద్ కు వస్తారని చెబుతున్నారు.
హైదరాబాద్ కు వచ్చేస్తున్న వారిలోచీకోటీ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. థాయ్ లాండ్ లో అరెస్టు అయిన వారిలో చాలామందికి ఆ దేశంలో గ్యాంబ్లింగ్ మీద నిషేధం ఉన్న విషయం తెలీదన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.
నాలుగు రోజులు సరదాగా థాయ్ లో గడిపేందుకే వచ్చారన్న విషయాన్ని పోలీసులుసైతం గుర్తించారు. అయితే.. వీరిని అరెస్టు చేయటం.. అక్కడి చట్టాలు కఠినంగా ఉంటాయన్న సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న కుటుంబాల వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. బాధితుల్లో ఇద్దరు ముగ్గురు మాత్రం తమ ఇంట్లోని వారికి ఫోన్ చేసి.. తిరిగి వచ్చేస్తున్నట్లుగా సమాచారం ఇచ్చారని చెబుతున్నారు.