Begin typing your search above and press return to search.

తెలుగు ప్రజలకు పోలీసుల వినతి.. వీడ్ని వదలొద్దు.. కనిపిస్తే సమాచారం ఇవ్వాలట

By:  Tupaki Desk   |   18 Oct 2021 5:18 AM GMT
తెలుగు ప్రజలకు పోలీసుల వినతి.. వీడ్ని వదలొద్దు.. కనిపిస్తే సమాచారం ఇవ్వాలట
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తాడేపల్లి అత్యాచార నిందితుడికి సంబంధించిన ఫోటోను విడుదల చేశారు పోలీసులు. ఇతగాడి ఆచూకీ పోలీసులకు అభ్యం కావటం లేదు. ఎంతగా ప్రయత్నించినా ఆచూకీ లభించకపోవటంతో తాజాగా అతగాడి ఫోటోను విడుదల చేసిన పోలీసులు.. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూడునెలల క్రితం కాబోయే భర్తతో కలిసి సీతానగరం పుష్కర ఘాట్ వద్దకు రావటం.. ఆ సందర్భంగా ముగ్గురు కలిసి.. కాబోయే భర్తను కట్టేసి.. అతని కళ్ల ముందే ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్ చేయటం తెలిసిందే.

ఏపీ సీఎం అధికార నివాసానికి దగ్గర్లో ఉండే ఈ ఉదంతంఅప్పట్లో పెను సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందికిగురి చేసింది. ఈ నిందితుల్ని పట్టుకునేందుకు ఏపీ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ కేసులో ఏ 1గా ఉన్న షేర్ క్రిష్ణతో పాటు.. ఏ3గా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్ లో ఉంచారు.
ఇదిలా ఉంటే.. ఘటన జరిగిన తర్వాత నుంచి ఏ2గా వ్యవహరిస్తున్న ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్ ఆచూకీ దొరకటం లేదు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయినా ప్రయోజనం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో అతడి పాత ఫోటోల్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం కుక్కలవారి పాలెనికి చెందిన 22 ఏళ్ల వెంకట్ కుడి చేతి మీద పుణ్యవతి అనే పచ్చబొట్టు ఉంటుందని చెబుతున్నారు. తాపీ పని.. కప్ బోర్డుల్ని అమర్చే పనులతో పాటు.. కర్ర నరకటం.. కుప్పల మార్పిడి.. క్యాటరింగ్ లకు కూడా వెళుతుంటాడని పోలీసులు చెబుతున్నారు.

అండర్ పాస్ లు.. పాడుబడిన భవనాలు.. హైవే అండర్ పాస్ ల దగ్గర ఉండటం.. రైల్లో అడుక్కునే వారితో.. సమోసాలు అమ్మే వారితోనూ ఇతను తిరుగుతుంటాడని చెప్పుకొచ్చారు. ఇతని ఆచూకీ లభిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మంగళగిరి నార్త్ డీఎస్పీకి కానీ.. తాడేపల్లి సీఐ.. ఎస్ ఐలకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన నేపథ్యంలో ఈ కామపిశాచి ఆచూకీ లభిస్తుందన్న ఆశా భావాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.