Begin typing your search above and press return to search.

తెలంగాణ రాజకీయాలపై బీజేపీ ఎంపీ సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   4 April 2023 12:27 PM GMT
తెలంగాణ రాజకీయాలపై బీజేపీ ఎంపీ సంచలన ప్రకటన
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడో ఆయన బయటపెట్టారు. ఇప్పుడు ఇదే మాట సంచలనంగా మారింది. ఏపీ బీజేపీ ఎంపీ , సీనియర్ నేత టీజీ వెంకటేశ్ తాజాగా తెలంగాణ రాజకీయాలపై ప్రకంపనలు రేపు మాట అన్నారు.

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరగకపోవచ్చంటూ సంచలన ప్రకటన చేశారు. ఏదో ఆషామాషీగా ఈ కామెంట్స్ చెప్పడం లేదని.. చాలా లాజికల్ గానే చెబుతున్నట్టు తెలిపారు.

కేసీఆర్ తన స్వార్థం కోసం ఆరోజు ముందస్తు ఎన్నికలకు వెళ్లారని.. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపకుండా కేంద్రం షాకివ్వబోతోందని టీజీ వెంకటేశ్ బాంబు పేల్చారు. ఈసారి ఏదైనా జరగొచ్చు అంటూ తెలిపారు. 2014 సార్వత్రిక ఎన్నికలతోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చంటూ టీజీ బాంబు పేల్చారు.

సార్వత్రిక ఎన్నికలతోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఐదారు నెలలు రాష్ట్రపతి పాలన తప్పదని టీజీ చెబుతున్నారు. ఇక ఏపీలోనూ రాష్ట్రపతి పాలన ఉంటే ఉండొచ్చని తెలిపారు. జగన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లరని.. అసెంబ్లీని రద్దు చేసే సాహసం చేయరని అంటున్నారు.

ఈ సందర్భంగా టీజీ పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పగలరు అంటూ కాకపుట్టించే కామెంట్స్ చేశారు. టీజీ వెంకటేవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో హీట్ పెంచాయి.

జనరల్ ఎలక్షన్ తోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకే లాభం. ఆ ఊఫులో గెలువవచ్చని భావిస్తోంది. మరి ఇదే జరిగితే బీఆర్ఎస్ కేసీఆర్ కు తీవ్ర నష్టంగా చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.