Begin typing your search above and press return to search.

ట్రంప్ మాదిరి మొండిగా: టెక్సాస్‌ లో లాక్‌ డౌన్ ఎత్తివేత‌

By:  Tupaki Desk   |   2 May 2020 5:30 PM GMT
ట్రంప్ మాదిరి మొండిగా: టెక్సాస్‌ లో లాక్‌ డౌన్ ఎత్తివేత‌
X
కరోనా వైరస్‌ కట్టడిలో ప్ర‌పంచంలో విఫ‌ల‌మైన దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే. క‌రోనా విజృంభిస్తున్నా తీవ్ర ఆంక్ష‌లు విధించ‌డంలో ఆ దేశ అధ్య‌క్షుడు డొన‌ల్డ్ ట్రంప్ వెన‌కాముందు ఆలోచించారు. ఆయ‌న మేల్కొని అమ‌లు చేసే వ‌ర‌కు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ప్ర‌స్తుతం అమెరికాలో ల‌క్ష‌ల్లో క‌రోనా బాధితులు ఉండ‌గా, పెద్ద సంఖ్య‌లో మృతులు ఉన్నారు. ప్ర‌స్తుతం ఆ దేశంలో ఇంకా క‌రోనా విజృంభించ‌డం త‌గ్గ‌డం లేదు. అయితే ప‌రిస్థితులు ఎలా ఉన్నా దేశంలోని ఓ రాష్ట్రం లాక్‌డౌన్‌ను ఎత్తేసింది. కొంతకాలంగా లాక్‌డౌన్‌లో ఉన్న ప్ర‌జ‌లు శుక్ర‌వారం నుంచి విముక్తి పొందారు. టెక్సాస్‌లో లాక్‌డౌన్‌ను ఎత్తి వేయ‌డం ద‌శ‌ల‌ వారీగా ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో రెస్టారెంట్లు, రీటెల్‌ అవుట్‌లెట్లు, సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయితే లాక్‌డౌన్‌ను తీవ్ర ఆంక్ష‌లు విధిస్తూనే ఎత్తేశారు. మాస్కులు ధరించాల‌ని, భౌతిక దూరం పాటించడం త‌ప్ప‌నిస‌రి చేశారు. టెక్సాస్‌ ట్రిబ్యూన్‌ తెలిపింది. అయితే ఈ లాక్‌డౌన్ స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌డం లేద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. షాపింగ్ మాల్స్‌, దుకాణాల్లో ప్ర‌జ‌ల‌ ఉష్ణోగ్రతలు పరీక్షించకుండానే అనుమతిస్తున్నారని గుర్తించారు. ఈ సంద‌ర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్ స్పందించి మాట్లాడారు. త‌మ రాష్ట్రంలో కరోనా మరణాలు 816 సంభ‌వించాయ‌ని ప్ర‌క‌టించారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో స్టోర్లు తిరిగి ప్రారంభించాలని ఆదేశిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దుకాణంలోకి ఒకేసారి అనుమ‌తించ‌మ‌ని, దుకాణంలో 25 శాతానికి మించి ప్ర‌జ‌లు ఉండ‌రాద‌ని ఆదేశించారు. పావు శాతం మందిని మాత్రమే ప్ర‌జ‌లును లోపలికి అనుమతించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.