Begin typing your search above and press return to search.

టీడీపీకి ప‌రీక్షా కాలం.. త‌ట్టుకునేదెలా..?

By:  Tupaki Desk   |   20 Nov 2021 12:30 AM GMT
టీడీపీకి ప‌రీక్షా కాలం.. త‌ట్టుకునేదెలా..?
X
అవును... ఇప్పుడు టీడీపీకి పెద్ద ప‌రీక్షా కాల‌మే న‌డుస్తోంది. వ‌రుస ఓట‌ములు.. పెద్ద ఎత్తున జంపింగులు.. కేడ‌ర్‌లో అనైక్య‌త‌.. వంటివి పార్టీని నిలువునా.. ఇబ్బంది పెడుతున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ‌.. కేడ‌ర్ దూకుడు లేక‌పోగా.. గ‌త కాల‌పు భ‌యాలతో బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. పార్టీ.. భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటోంద‌ని చెప్ప‌క త‌ప్పదు.

అయితే.. అదేస‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది కాదు.. ఇక ముందు జ‌ర‌గ‌బోయే కాలం కూడా పార్టీకి కీల‌క‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా.. ఇప్ప‌టి వ‌ర‌కు చూసుకుంటే.. రెండున్న‌రేళ్లు మాత్ర‌మే కాలం గ‌డిచింది.

ఈ రెండున్న‌రేళ్ల‌లోనే పార్టీ తీవ్ర సంక‌ట ప‌రిస్థితిని ఎదుర్కొంది. మొత్తం 23 మంది ఎమ్మెల్యేల్లో న‌లుగురు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అధికార పార్టీకి మ‌ద్ద‌తుగా మారారు. ఇక‌, కేడ‌ర్‌లోనూ అనిశ్చితి కొన‌సాగు తోంది. ఒక్క అనుకూల మీడియాలోనే టీడీపీని ఎత్తేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది త‌ప్పితే.. వాస్త‌వ‌ప ప‌రిస్థితి ని గ‌మ‌నిస్తే.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల మ‌ధ్య వివాదాలు. విభేదాలు.. వంటివి స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఎవ‌రూ ఒక్క రూపాయికూడా బ‌య‌ట‌కు తీయ‌డం లేదు.

దీనికి ఒక‌రిపై ఒక‌రు చెప్పుకొంటున్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. ``ఆయ‌న మంత్రిగా ఉండి పోగేసుకున్నాడు. ఇప్పుడు తీయొచ్చుగా`` అని కొంద‌రు నాయ‌కులు బాహాటంగానే ఈ ఏడాది జ‌రిగిన స్థానిక స‌మ‌రంలో.. వ్యాఖ్యానించారు.

ఇక‌, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది గ‌తంలో చేసిన ప‌నులు కొంద‌రు నేత‌ల‌ను వెంటాడుతున్నాయి. దీంతో తాము గ‌ళం వినిపిస్తే.. పార్టీ త‌ర‌ఫున జెండా ప‌ట్టుకుని ప‌నిచేస్తే.. ఎక్క‌డ ఇరుకున ప‌డ‌తామో.. అనే భ‌యం వారిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీనికితోడు.. స‌భ్య‌త్వం న‌మోదు కూడా ఇప్పుడు.. ప్ర‌హ‌సనంగా మారింది. మ‌రి ఇప్పుడు ఈ రెండున్న‌రేళ్ల స‌మ‌యంలోనే పార్టీ ఇలా ఇబ్బందులు ప‌డుతుంటే.. రాబోయే రెండున్న‌రేళ్ల‌లో పార్టీ ప‌రిస్థితి ఏంటి? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఎందుకంటే.. రాబోయే రోజులు ఖ‌చ్చితంగా ఒక అగ్ని ప‌రీక్ష‌గానే మార‌తాయి.

నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డం.. పార్టీ స‌భ్య‌త్వాలు పెంచ‌డం.. కేడ‌ర్‌లో అసంతృప్తుల‌ను త‌గ్గించ డం.. వీటికిమించి.. ఎమ్మెల్యేలు.. కీల‌క నేత‌ల‌ను కాపాడు కోవ‌డం.. సామాజిక వ‌ర్గాల వారీగా.. ఓటు బ్యాంకు ను కాపాడుకోవ‌డం వంటివి ఇప్పుడు.. టీడీపీకి ప్ర‌ధానంగా క‌నిపిస్తున్న ల‌క్ష్యాలు. అదేస‌మ‌యంలో పార్టీలో నెంబ‌ర్ 2 అనే మాట కూడా వినిపిస్తున్న ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ పోస్టు పై చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు.

ఇప్ప‌టికే చేప‌ట్టిన ఎన్నిక‌ల్లో త‌న స‌త్తాను నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేసినా.. లోకేష్ ఆ స్థాయిలో పుంజుకోలేక పోయారు. దీంతో భ‌విష్య‌త్తులో ఆయ‌న‌ను ఎలా లైన్‌లో పెట్టాలి? ఇలా అనేక స‌మ‌స్య‌లు పార్టీని ఇబ్బందికి గురి చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రి దీనిని బ‌ట్టి వ‌చ్చే రెండున్న‌ర ఏళ్లు కూడా.. ఖ‌చ్చితంగా ప‌రీక్షా కాల‌మ‌నే చెప్పాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.