Begin typing your search above and press return to search.

ఆ ఫీచర్ వెనక్కి తీసుకున్న టెస్లా.. కారణం ఇదే..!!

By:  Tupaki Desk   |   25 Dec 2021 3:49 AM GMT
ఆ ఫీచర్ వెనక్కి తీసుకున్న టెస్లా.. కారణం ఇదే..!!
X
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్ తన కంపెనీ నుంచి ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ కార్లలో లో కొన్ని ప్రత్యేకతలను తొలగించనున్నట్లు తెలిపారు. మస్క్ కు చెందిన ఈ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ పెరు టెస్లా. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే అనేక ప్రత్యేకతలతో వివిధ రకాలైన కార్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఎక్కువగా అమెరికాలో ఉపయోగిస్తారు. అయితే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఇటీవల టెస్లా అద్భుతమైన ఫీచర్ను ఎలక్ట్రిక్ కార్లలో ప్రవేశపెట్టింది.

అదేమిటంటే డ్రైవర్ కి పక్కన ఉన్న సీట్లు ఉండే వ్యక్తి ఎంచక్కా వీడియో గేమ్ ఆడుకునేలా ఒక సాంకేతికతను రూపొందించింది. అయితే ఈ సాంకేతికత పై నెటిజన్లు అప్పుడే తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. అలా చేయడం వల్ల డ్రైవింగ్ సీట్లో ఉండే వ్యక్తి కి వాహనం నడపడం పై ఉండే కాన్సన్ట్రేషన్ అంతా మారిపోతుందని దీంతో ప్రమాదాలు జరుగుతాయని నిజం చెప్పారు. అంతేకాకుండా ఈ కారు లో ఉండే మరి కొన్ని ఫీచర్లను కూడా కట్ చేయాలని కంపెనీ భావిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు వీడియో గేమ్స్ తో పాటు, డ్యాష్ బోర్డ్ స్క్రీన్ ఉపయోగించకుండ ఓ సాంకేతికతను రూపొందించింది. దీని వల్ల కార్ మూవింగ్ లో ఉన్నప్పుడు తాత్కాలికంగా అవి పని చేయవు. దీనితో డ్రైవర్ సులభంగా కారు నపడడంపై దృష్టి సారించవచ్చు. ఈ నిర్ణయం తీసుకునే వెనుక అమెరికాకు చెందిన రోడ్ అండ్ సేఫ్టీ ట్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రమేయం ఉంది. దీని కోరిక మేరకు టెస్లా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒప్పందానికి వచ్చాయి.

కొద్ది రోజుల క్రితం టెస్లా కారులో డ్రైవర్ కారు నడుపుతుండగా పక్కనే ఉన్న వీడియో గేమ్ ఆడేలా ఉన్న ఫోటోను కంపెనీ విడుదల చేసింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఈ ఫీచర్ ను బేస్ చేసుకుని అనేక మంది తమ వ్యతిరేకతను తెలిపారు. ఆటో పైలెట్ విధానంతో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి టెస్లా కారు ఇలాంటి వీడియో గేమ్ లాంటి అదనపు హంగులు అద్ది పెట్టి అదనపు హంగులు తీసుకొచ్చింది. కానీ ప్రజల నుంచి ఆ మెడల్ పైన వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది.

అమెరికాలో ఉన్న 5 మిలియన్ టెస్లా కారులో ఈ ఫీచర్ ను డిసైబుల్ చేయనుంది టెస్లా.