Begin typing your search above and press return to search.

టెస్లా ఏకైక లక్ష్యం ఇండియానే.. ఎట్టకేలకు మార్కెట్లోకి

By:  Tupaki Desk   |   21 April 2023 11:26 AM GMT
టెస్లా ఏకైక లక్ష్యం ఇండియానే.. ఎట్టకేలకు మార్కెట్లోకి
X
భారత్ లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు హాట్ కేకులా అమ్ముడవుతున్నాయి. దేశంలో మోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్ కంటే పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యత ఇస్తుండడం.. రాయితీలు ప్రకటించడంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జోరందుకున్నాయి. కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మందగమనం వేళ భారతీయ మార్కెట్ మాత్రం కళకళలాడుతోంది. దీంతో ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ ఇప్పుడు భారతీయ మార్కెట్లోకి తన టెస్లా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశ పెట్టేందుకు రెడీ అయ్యారు.

2023 తొలి త్రైమాసికంలో ఎలన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా, నిర్వహణ ఆదాయంలో 24% తగ్గుదలని చవిచూసింది. ఫలితంగా మొత్తం $2.7 బిలియన్లు కోల్పోయింది.. లాభంలో ఈ క్షీణత, కంపెనీ వాహనాల ధరల తగ్గింపు కారణంగా గురువారం ట్రేడింగ్ సమయంలో టెస్లా షేర్లు 10% పడిపోయాయి.

ఈ ఆర్థిక పనితీరు అమెరికన్ మార్కెట్ ఒడిదుడుకులను సూచిస్తోందని అర్థమవుతోంది. అయితే ఇది టెస్లా ఎలోన్ మస్క్ పెట్టుకున్న ప్రతిష్టాత్మక లక్ష్యాలను పూర్తి చేయలేదనడానికి ఆంటకం కాదని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న భారతీయ మార్కెట్‌లోకి టెస్లాను విస్తరించడం కంపెనీకి ఉత్తమమైన మార్గంగా భావిస్తోంది.

ఎలోన్ మస్క్ తన వ్యాపారాన్ని భారత్‌లో విస్తరించేందుకు భారత ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక అభ్యర్థనలకు లేదా రాయితీలకు లొంగలేదు. ఇతర విదేశీ పారిశ్రామికవేత్తల వలె ఎలన్ మస్క్ కు ఎటువంటి రాయితీలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఫలితంగా, ఎలన్ మస్క్ ఇప్పటి వరకు భారతదేశంలోకి తన విస్తరణను కొనసాగించలేదు.

అయితే మస్క్ తన లక్ష్యాలను సాధించాలంటే.. టెస్లా మనుగడ కోసం భారతదేశానికి రావడం అత్యవసరం అని గుర్తించాడు. సంపన్న భారతీయ జనాభా శక్తిని తక్కువ అంచనా వేయకూడదని అతడు భావిస్తున్నారు. వారు టెస్లా కార్లను బుకింగ్ చేయడానికి ఆసక్తిని చూపుతుండడంతోనే కొన్ని నెలల్లో భారత్ లో టెస్లా కార్లు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. భారతదేశం అంతటా కనీసం ఒక మిలియన్ కార్లు బుక్ చేయబడతాయని ఎలన్ మస్క్ భావిస్తున్నారు.

భారతీయులను తమ వినియోగదారులుగా పరిగణించకుండా ఏ అమెరికా ఉత్పత్తులను విక్రయించే కంపెనీ అంతర్జాతీయ వృద్ధిని సాధించలేదన్న వాస్తవాన్ని ఎలాన్ మస్క్ అర్థం చేసుకున్నట్టు ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్ కావడం ఇక్కడ కంపెనీలు గమనించాలి.

ఎలోన్ మస్క్ భారతదేశంలోకి ప్రవేశించడానికి మరింత ఆలస్యం చేస్తే అతనికి నష్టం తప్పితే లాభం ఉండదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాస్త అహం తగ్గించి ప్రభుత్వంతో సానుకూలంగా ఉండి టెస్లా కార్లను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.