Begin typing your search above and press return to search.

న్యూయార్క్ సిటీ రోడ్ల‌పై.. టెస్లా సైబ‌ర్ ట్ర‌క్ హ‌ల్‌చ‌ల్!

By:  Tupaki Desk   |   9 May 2021 7:30 AM GMT
న్యూయార్క్ సిటీ రోడ్ల‌పై.. టెస్లా సైబ‌ర్ ట్ర‌క్ హ‌ల్‌చ‌ల్!
X
టెస్లా.. సైబ‌ర్ ట్ర‌క్ న‌మూనా వాహ‌నం శ‌నివారం రాత్రి న్యూయార్క్ సిటీ రోడ్ల‌పై హ‌ల్‌చ‌ల్ చేసింది. మాన్‌హాట‌న్‌ న్యూయార్క్‌లోని మీట్‌ప్యాకింగ్ జిల్లాలో ఉన్న కంపెనీ షోరూమ్‌లో ఈ సైబ‌ర్ ట్ర‌క్‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. ఆదివారం వ‌ర‌కు ఈ ట్ర‌క్ షోరూమ్‌లో ఉంటుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

ఇక‌, సైబ‌ర్ ట్ర‌క్‌.. న్యూయార్క్ రోడ్ల‌పై వెళ్తున్న స‌మ‌యంలో అనేక మంది ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటెత్త‌డం విశేషం. 2019 న‌వంబ‌రులో దీనిని ఆవిష్క‌రించిన‌ప్ప‌టి నుంచి అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ర్షిస్తోంది సైబ‌ర్ ట్ర‌క్‌. 2020లో తొలుత ఇది లాస్ ఏంజెలెస్‌లోని పీట‌ర్స‌న్ ఆటోమోటివ్ మ్యూజియంలో ద‌ర్శ‌నమిచ్చింది.

తాజాగా టెస్లాకు చెందిన గిగా టెక్సాస్ కన్‌స్ట్ర‌క్ష‌న్ సైట్‌లో క‌నిపించడం విశేషం. ఇక‌, టెస్లా సైబ‌ర్ ట్ర‌క్ త‌మ‌ను ఎంతో ఆక‌ట్టుకుంద‌ని ప‌లువురు ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఎలోన్ మస్క్ సైబ‌ర్‌ట్ర‌క్‌ కోసం మిలే సైరస్ తో కలిసి తన ఎస్ఎన్ఎల్ హోస్టింగ్ కంటే ముందు బిగ్ ఆపిల్ ను సందర్శించారు.