Begin typing your search above and press return to search.

జమ్మూలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులు

By:  Tupaki Desk   |   1 Feb 2020 7:45 AM GMT
జమ్మూలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులు
X
జమ్ములోని నగ్రోట టోల్ ప్లాజా వద్ద భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం హోరా హోరీన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భారత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదులని అంతమొందించారు. నగ్రోట టోల్ ప్లాజా వదద్ భద్రతా బలగాలు శుక్రవారం తెల్లవారు జామున 5 గంటలకు ఓ ట్రక్కును తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు దిగారు. దీంతో వారు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు హతం కాగా ఓ జవాన్ కు గాయాలయ్యాయి. ఉగ్రవాదులు శ్రీనగర్ వైపు ట్రక్కులో ప్రయాణిస్తున్న సమయంలో.. భద్రతాదళాలు తనిఖీలు చేస్తుండగా ట్రక్కులో ఉన్న ఉగ్రవాదులు జవాన్ల పై కాల్పులకు దిగారనీ దీంతో జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

అయితే , కశ్మీర్‌ లోకి చొరబడేందుకు యత్నించి ఎన్‌ కౌంటర్‌ లో మృతిచెందిన ఉగ్రవాదులు భారత్‌ లో భారీ దాడికి కుట్రపన్నారని పోలీసులు తెలిపారు. దాడుల కోసం పెద్దమొత్తంలో బాంబులు, మార్ఫిన్‌ ఇంజెక్షన్లు, ఎల్‌ ఈడీలు, బుల్లెట్‌ జాకెట్లు పాకిస్తాన్‌ నుంచి తీసుకువచ్చారని చెప్పారు. రహదారి వెంబడి దాదాపు 300 కిలోమీటర్ల మేర ఉన్న భద్రతా దళాల శిబిరాలపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళికలు వేశారని వారి కుట్రని బయట పెట్టారు. ఎన్ కౌంటర్ అనంతరం ఉగ్రవాదుల నుంచి ఏకే 47రైఫిల్‌, గ్రెనెడ్లను, రూ.32,000లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురు ఉగ్రవాదులు జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ కు చెందిన వారని, సముద్రం గా గుండా భారత్‌ లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. కాగా..జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ లో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు దిగటం ఇదే మొదటి సారి.