Begin typing your search above and press return to search.
టన్నెల్ల ద్వారా దేశంలోకి టెర్రరిస్టులు
By: Tupaki Desk | 14 Sep 2020 8:30 AM GMTభారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత సైన్యం పకడ్బందీగా కాపు కాస్తూ ఉగ్రవాదులను ఏరివేస్తుండడంతో వారంతా కొత్త దారులు వెతుకుతున్నారు. టన్నెల్స్ తవ్వుకొని వాటి ద్వారా బయటకు వస్తున్నారు.
దేశంలో కల్లోలం సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. ఉగ్రవాదులను చేరవేసేందుకు సరిహద్దుల వద్ద భూ సొరంగాలను నిర్మిస్తోందని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపారు.
ఉగ్రవాదులను టన్నెల్స్ ద్వారా భారత్ లోకి పంపిస్తూ వారికి ఆయుధాలను డ్రోన్ల ద్వారా అందిస్తోందని డీజీపీ తెలిపారు. తాజాగా జమ్మూలోని సాంబ జిల్లా గలార్ గ్రామంలో 170 మీటర్ల పొడవైన సొరంగం గుర్తించామన్నారు. సరిహద్దుల్లో ఉన్న టన్నెల్లను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు.
సరిహద్దుల ద్వారా ఉగ్రవాదులపై పటిష్ట నిఘా ఉండడం.. భారత సైన్యం ఎన్ కౌంటర్లతో లేపేస్తుండడంతో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇప్పుడు టన్నెల్స్ తవ్వుకొని భూ గర్భం లోంచి భారత్ లోకి ప్రవేశిస్తున్నారు. ఈ కొత్త తరహాలో సొరంగాలను జమ్మూ సరిహద్దుల్లో సైన్యం గుర్తిస్తోంది. వెంటనే వాటిని పూడ్చివేస్తూ సరిహద్దుల్లో నిఘాన పటిష్టం చేస్తోంది.