Begin typing your search above and press return to search.

భారత్ జేమ్స్ బాండ్ ఇంటి వద్ద ఉగ్రవాదుల రెక్కీ

By:  Tupaki Desk   |   14 Feb 2021 9:31 AM GMT
భారత్ జేమ్స్ బాండ్ ఇంటి వద్ద ఉగ్రవాదుల రెక్కీ
X
సినిమాల్లో కనిపించే జేమ్స్ బాండ్ మాదిరి కాకున్నా.. తన చేష్టలతో అలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్న కీలక అధికారిగా అజిత్ డోభాల్ ను చెప్పాలి. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా ఆయన వ్యవహరిస్తున్నారు. తాజాగా.. ఆయన నివాసానికి దగ్గర్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లుగా తేలింది. ఈ నెల ఆరున ఢిల్లీలోని డోభాల్ నివాసంతో పాటు.. మరికొన్నిచోట్ల రెక్కీని చేపట్టినట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ రెక్కీ నిర్వహించిన్టులగా ఈ నెల ఆరున అరెస్టు అయిన జైషే మొహమ్మద్ ఉగ్రవాది హిదాయత్ ఉల్లా మాలిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడ్ని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తాజా సంచలన నిజం బయటకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో డోభల్ నివాసం వద్ద సెక్యురిటీని మరింత కట్టుదిట్టం చేశారు.

ఉగ్రదాడులకు రెక్కీలు నిర్వహించటం.. దాడులకు ప్లాన్ చేయటం.. ఉగ్రవాదుల్ని తీసుకొచ్చి.. టార్గెట్ చేసిన ప్రాంతాల్లో వారిని దింపటం లాంటివి చేస్తారని గుర్తించారు. అంతేకాదు.. తాను ఎనిమిది మంది ఉగ్రవాదులతో టచ్ లో ఉన్నట్లుగా విచారణలో వెల్లడైనట్లుగా తేలింది. దీంతో.. అలెర్టు అయిన భద్రతా విభాగం డోభాల్ నివాసం వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భారత బాండ్ ను టార్గెట్ చేసిన ముష్కరుల లెక్క తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరేం చేస్తారో చూడాలి.