Begin typing your search above and press return to search.

జమ్మూలో రెచ్చిపోయిన ఉగ్రవాది .. ఇద్దరు పోలీసులు మృతి ,వీడియో వైరల్

By:  Tupaki Desk   |   19 Feb 2021 10:15 AM GMT
జమ్మూలో రెచ్చిపోయిన ఉగ్రవాది .. ఇద్దరు పోలీసులు మృతి ,వీడియో వైరల్
X
జమ్మూకాశ్మీర్ లో ఓ ఉగ్రవాది విచక్షణా రహితంగా రెచ్చిపోయి , నడిరోడ్డులో భయానక వాతావరణం సృష్టించాడు. పోలీసులను టార్గెట్ గా చేసుకొని ఒక్కసారిగా వారిపైకి కాల్పులకు దిగాడు. ఈ ఊహించని పరిణామంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయినప్పటికీ అప్పటికే ఇద్దరు పోలీసులు తమ ప్రాణాలని వదిలేశారు. వివరాల్లోకి వెళ్తే .. భగత్ బార్జుల్లా ప్రాంతంలోని పోలీసులు పహారా కాస్తుండగా, ఓ టెర్రరిస్టు అక్కడికి వచ్చాడు. సాధారణ వ్యక్తిలా నడుకుచూ ముందు వచ్చి ఒక్కసారిగా కాల్పులకు దిగాడు.

దుస్తుల లోపల తుపాకీ దాచుకోవడంతో ఎవరూ గుర్తించలేదు. పోలీసులకు దగ్గరగా వచ్చిన తర్వాత తుపాకీ బయటకు తీసి. ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు పోలీసులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఇద్దరు మరణించారు. మరికొరు చికిత్స పొందుతున్నారు.

ఉగ్రవాది కాల్పుల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన తర్వాత శ్రీనగర్‌ లో హై అలర్ట్ ప్రకటించారు. ఘటనా స్థలానికి భారీగా భద్రతా దళాలు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. పోలీసులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. అటు షోపియన్, బుద్గాం జిల్లాల్లోనూ ఇదే రోజు ఎన్ ‌కౌంటర్‌ లు జరిగిన విషయం తెలిసిందే.

బుద్గాంలోని బీర్వా ప్రాంతాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ మరణించారు. షోపియన్ జిల్లా బడిగమ్ ప్రాంతంలో కూడా భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి