Begin typing your search above and press return to search.
ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలి: యూఎన్ లో మోడీ
By: Tupaki Desk | 26 Sep 2020 5:41 PM GMTఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి75వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన మోడీ ఈ మేరకు కీలక సందేశం ఇచ్చారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు రావాలని మోడీ స్పష్టం చేశారు.భారత్ కు ఐక్యరాజ్యసమితి మరింత పెద్దపీట వేయాలని కోరారు.
భారత్ ఎల్లప్పుడూ విశ్వశాంతి కోరుకుంటుందని మోడీ తెలిపారు.ప్రస్తుతం ప్రపంచం సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని.. ఉగ్రవాదం.. కరోనా వైరస్ తో పోరాడుతున్నామన్నారు. ఐక్యరాజ్యసమితి చేయగలిగినంత చేస్తోందా అని మోడీ ప్రశ్నించారు.
కరోనా వ్యాక్సిన్లను వేగంగా తయారు చేయగల సామర్థ్యం భారత్ కు ఉందని.. తాము ప్రపంచానికి అందిస్తామని మోడీ అన్నారు. ఐక్యరాజ్యసమితికి ఇదే అతిపెద్ద సవాల్ అన్నారు.
1945లో యూఎన్ ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులు.. ఇప్పుడు పరిస్థితులు ఏమిటని మోడీ ప్రశ్నించారు. ఐరాసలో సంస్కరణల కోసం దీర్గకాలంగా ఎదురుచూస్తున్నామని తెలిపారు.
21వ శతాబ్ధపు సవాళ్లకు అనుగుణంగా ఐరాసలో సంస్కరణలు రావాలని మోడీ చెప్పారు. ఐరాస సమూల ప్రక్షాళన చేయాలని కోరారు.