Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క‌లో ఉగ్ర‌దాడి.. ఆటోలో పేలుడు ఇద్ద‌రు మృతి

By:  Tupaki Desk   |   20 Nov 2022 10:30 AM GMT
క‌ర్ణాట‌క‌లో ఉగ్ర‌దాడి.. ఆటోలో పేలుడు ఇద్ద‌రు మృతి
X
బీజేపీ పాలిత క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఉగ్ర‌వాద దాడి జ‌రిగిన‌ట్టు ఆ రాష్ట్ర డీజీపీ ప్ర‌వీణ్‌సూద్ తెలిపారు. కదులు తున్న ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించిందని, దీంతో వాహనంలో మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకుందని అన్నారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా మరో ప్రయాణికుడు మృతి చెందిన‌ట్టు చెప్పారు. కర్ణాటకలోని మంగళూరులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రుగుతోంద‌ని తెలిపారు.

అయితే, ఇప్ప‌టికి ఈ ఘటన ప్రమాదం కాదని తేల్చిన‌ట్టు డీజీపీ చెప్పారు. ఇందులో ఉగ్రకోణం ఉందని ప్రవీణ్ సూద్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అంతేకాదు, మంగళూరు పేలుళ్లలో కోయంబత్తూరు పేలుళ్ల‌కు లింక్ బయటపడిందని ఆయ‌న చెప్పారు.

శ‌నివారంరాత్రి సంభ‌వించిన ఈ ఘ‌ట‌న‌పై ఆదివారం తెల్లవారుజామున ఎన్‌ఐఏ బృందం దర్యాప్తును వేగవంతం చేసేందుకు పేలుడు స్థలానికి చేరుకుందని డీజీపీ వివ‌రించారు. కర్ణాటకలోని మంగళూరులో రద్దీగా ఉండే రోడ్డు వద్ద శనివారం కదులుతున్న ఆటోరిక్షాలో పేలుడు సంభవించింది, ఇది ప్రమాదవశాత్తు కాదు, ఇది ఉగ్ర చర్య అని ఆయ‌న‌ ధృవీకరించారు. ప్రెషర్ కుక్కర్ బాంబు పేలడంతో రిక్షా డ్రైవర్ మరియు ప్రయాణీకుడు ఇద్దరు వ్యక్తులు మృతి చెందార‌న్నారు.

ఈ ఘటనలో ఆటోరిక్షా డ్రైవర్‌కు ఎలాంటి పాత్రా లేదని, ప్రయాణికుడు నకిలీ ఆధార్ కార్డును కలిగి ఉన్నాడని కర్ణాటక డీజీపీ ధృవీకరించారు. 'ఇది ఇప్పుడు ధృవీకరించబడింది. పేలుడు ప్రమాదవశాత్తు కాదు, తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశ్యంతో జరిగిన టెర్రర్ చర్య. దీనిపై కేంద్ర ఏజెన్సీలతో పాటు కర్ణాటక రాష్ట్ర పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు' అని కర్ణాటక డీజీపీ సూద్ తెలిపారు