Begin typing your search above and press return to search.

అప్పుడే మొదలు; పంజాబ్ ఎయిర్ బేస్ మీద దాడి

By:  Tupaki Desk   |   2 Jan 2016 10:42 AM IST
అప్పుడే మొదలు; పంజాబ్ ఎయిర్ బేస్ మీద దాడి
X
కొత్త సంవత్సరం సంతోషంగా మొదలు పెట్టిన కొద్ది గంటల్లోనే ఉగ్రదాడితో ఉలిక్కిపడే ఘటన తాజాగా చోటు చేసుకుంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ ఫోర్స్ ఫ్రాంతంలో ఆర్మీ దుస్తులతో కొందరు జవాన్ల మాదిరి వచ్చి.. కాల్పులకు తెగబడటం సంచలనంగా మారింది. కొత్త సంవత్సరం వేడులకతో ఉత్సాహంగా సాగి.. అందరూ ఆదమరచి నిద్రపోతున్న వేళ.. శనివారం ఉదయం 3.30గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఎయిర్ బేస్ వద్ద నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపటం ప్రారంభించారు.

ఊహించని పరిణామానికి ఒక్కసారి ఉలిక్కిపడినప్పటికీ.. వెనువెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఒక్కసారిగా ఎదురుకాల్పులు స్టార్ట్ చేశారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు భీకరంగా సాగుతున్నాయి. ఈ కాల్పుల నేపథ్యంలో ఇప్పటికి ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. పటిష్టమైన భద్రత ఉన్న ఎయిర్ బేస్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించటం కలకలం రేపుతోంది.

అయితే.. రెండు రోజుల ముందే గుట్టుచప్పుడు కాకుండా ఎయిర్ బేస్ లోకి ప్రవేశించి.. ఇప్పుడిలా కాల్పులు జరుపుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. మరోవైపు తాజా ఉగ్రఘటన నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర సర్కారు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మిగిలిన ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే కార్యక్రమం తీవ్రంగా సాగుతోంది. కొత్త సంవత్సరం మొదలైందో లేదో.. అప్పుడే ఉగ్ర ఘటనలు షురూ అయినట్లే.