Begin typing your search above and press return to search.

మధ్యప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం ... 38 మృతదేహాలు వెలికితీత !

By:  Tupaki Desk   |   16 Feb 2021 9:30 AM GMT
మధ్యప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం ... 38 మృతదేహాలు వెలికితీత !
X
మధ్యప్రదేశ్ ‌లోని సిద్ధి జిల్లాలో మంగళవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. దాదాపు 60 మంది వరకు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి సిధి జిల్లా పట్నా సమీపంలో ఉన్న బ్రిడ్జి నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముందుగా 28 మంది మృతి చెందినట్లు గుర్తించగా, సహాయక చర్యలు కొనసాగే కొద్ది మృతుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇప్పటి వరకు 38 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం.

సిద్ధి నుంచి సాత్నా వెళ్తుండగా ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఐజీ ఉమోష్ జోగ తెలిపారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సు ఫోర్సుతో పాటు గజ ఈతగాళ్లు, క్లేన్లను రంగంలోకి దింపారు. బాణసాగర్ కెనాల్‌ లో నీటిని సిహ్వాల్ కెనాల్‌ లోకి విడుదల చేయడం ద్వారా బస్సును క్రేన్లతో వెలికితీసే చర్యలు చేపట్టారు. కాగా, ఇది చాలా దురదృష్టకర ఘటన అని, ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సహాయక చర్యలకు ఆదేశాలిస్తున్నట్టు మధ్యప్రదేశ్ మంత్రి తులసి సిలావత్ తెలిపారు. తాను, మరో మంత్రి కలిసి ఘటనా స్థలికి వెళ్తున్నామని, ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 30కి పైగా మృతదేహాలను వెలికితీసినట్టు చెప్పారు. కాల్వలో ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో ఎగువన బన్‌సాగర్ డామ్ నుంచి నీటి విడుదలను నిలిపివేయాలని అధికారులకు సూచించారు.