Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే కారుకి ఘోర ప్రమాదం !

By:  Tupaki Desk   |   30 Sep 2020 1:00 PM GMT
వైసీపీ ఎమ్మెల్యే కారుకి ఘోర ప్రమాదం !
X
నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. తెట్టు జంక్షన్ దగ్గర నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కారు మరో వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ రోడ్డు ప్రమాదంలో కారు ముందు బాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయినట్టు తెలుస్తుంది. అయితే , ఆ సమయంలో ఎమ్మెల్యే ఆ కారులో లేరు. దీనితో ఎమ్మెల్యేకి పెను ప్రమాదం తప్పింది. ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. దీనితో డ్రైవర్ ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు ఘటన పై ఆరా తీశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆరోగ్య బాగాలేకపోవడంతో ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఓ పనిమీద ఎమ్మెల్యే కారు డ్రైవర్ విజయవాడ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి ఎమ్మెల్యే కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రమాదంతో రోడ్డుపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.