Begin typing your search above and press return to search.
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
By: Tupaki Desk | 27 March 2022 4:40 AM GMTదారుణ రోడ్డు ప్రమాదం శనివారం రాత్రి చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. తిరుపతి పట్టణానికి 36కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకున్న ఈ దారుణ ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. అప్పటివరకు ఉల్లాసంగా సాగిన ప్రయాణం.. కనురెప్ప తెరిచేంత సమయంలో చోటు చేసుకున్న ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది.
ఎంగేజ్ మెంట్ కు వెళుతున్న వారంతా ఫుల్ జోష్ లో ఉన్నవేళలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదం తీరని కడుపుకోతను మిగిల్చింది. మరింత విషాదం ఏమంటే.. ప్రమాదం జరిగిన రెండు గంటల వరకు అసలీ ఘోరం జరిగినట్లుగా ప్రపంచానికి తెలియని పరిస్థితి.
అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన మల్లిశెట్టి వేణుకు.. పుత్తూరుకు సమీపంలోని నారాయణ వనానికి చెందిన కుసుమకు పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం తిరుపతి సమీపంలోని తిరుచానూరులో ఎంగేజ్ మెంట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పెళ్లి కుమారుడితో పాటు మొత్తం 63 మందితో బస్సు బయలుదేరింది.
శనివారం మధ్యాహ్నం 3.30 గంటల వేళలో ధర్మవరం నుంచి ఈ ప్రైవేటు బస్సు బయలుదేరింది. మరో ముప్పావు గంటలో గమ్యస్థానానికి చేరుకోనున్న వేళ.. అనూహ్యంగా ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలోని పీలేరు - తిరుపతి మధ్యనున్న భాకరాపేట ఘాట్ రోడ్డులో ఈ దారుణం చోటు చేసుకుంది.
రోడ్డుకు సుమారు 100 అడుగుల లోయలో బస్సు పడిపోయింది. డ్రైవర్ కు ఘాట్ రోడ్డు మీద బస్సును నడిపే అవగాహన లేకపోవటం.. ఘాట్ రోడ్ లో ప్రయాణించాల్సిన దాని కంటే వేగంగా బస్సు ప్రయాణిస్తుండటంతో మలుపు తిప్పే వేళలో డ్రైవర్ అవగాహన రాహిత్యం.. నిర్లక్ష్యం బస్సు లోయలో పడేలా చేసింది.
దీంతో.. డ్రైవర్ తో సహా మరో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. విషాదమేమంటే.. ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తం చిమ్మ చీకటిగా ఉండటం.. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవటంతో.. ఈ దారుణ ప్రమాదం జరిగిందన్న విషయం దాదాపు రెండు గంటల ఆలస్యంగా కానీ బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి.
ప్రమాదం జరిగిన వేళ.. ఘాట్ రోడ్డులో గాల్లో తిరుగుతూ వంద అడుగుల లోతులో బస్సు పడిపోవటం.. కింద పెద్ద పెద్ద కొండ రాళ్లును వేగంగా బస్సు ఢీ కొట్టటంతో బస్సు కింది భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. బస్సు చక్రాలు.. యాక్సిల్ ముక్కలు ముక్కలుగా అయ్యాయంటే.. ప్రమాద తీవ్రత ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.
సమాచారం తెలిసినంతనే రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రమాద స్థలంలో టార్చిలైట్లు.. ఫ్లడ్ లైట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అప్పటివరకు హుషారుగా కబుర్లు చెప్పుకున్న వారంతా తమ కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవటం.. సహాయక చర్యల కోసం సమాచారాన్ని బయటకు తెలియజేయటం కోసం వారు తపించారు. ఓవైపు తీవ్ర విషాదం.. మరోవైపు ప్రాణాలతో బయటపడిన వారికి గాయాలు కావటంతో.. ప్రమాద స్థలంలో హాహాకారాలు చోటు చేసుకున్నాయి.
జిల్లా కలెక్టర్ హరినారాయణన్.. తిరుపతి అర్బన్ ఎస్పీలు స్వయంగా ఈ ప్రమాద ఘటన వద్ద ఉండి పర్యవేక్షిస్తూ.. సహాయక చర్యల్ని చేటప్టారు. బస్సులో ఎంతమంది ఉన్నారన్న విషయంపై కచ్ఛిత సమాచారం బయటకు రాలేదు. శనివారం అర్థరాత్రి వేళకు గాయపడిన వారిలో 43 మందిని తిరుపతి రుయాకు తరలించారు.
ప్రమాద అనంతరం ప్రాణాలతోబయటపడిన వారిలో దాదాపు 40 మంది వరకు గాయాలపాలైనట్లుగా చెబుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో ఏడుగురు చిన్నారులు.. పది మంది మహిళలు ఉన్నారు. పెళ్లి కొడుకు కూడా గాయాల పాలయ్యారు.