Begin typing your search above and press return to search.

కేసీఆర్ బ‌ర్త్ డే వేడుక‌లు-మంత్రికి త‌ప్పిన ప్ర‌మాదం

By:  Tupaki Desk   |   17 Feb 2018 8:30 AM GMT
కేసీఆర్ బ‌ర్త్ డే వేడుక‌లు-మంత్రికి త‌ప్పిన ప్ర‌మాదం
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతుండ‌గా..మ‌రోవైపు ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల సంద‌ర్భంగా భారీ అప‌శృతి చోటుచేసుకుంది. ఏకంగా క్యాబినెట్ మంత్రికి ప్రాణాపాయం ఎదురైంది. అయితే అదృష్ట‌వ‌శాత్తు ఆయ‌న సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో మున్నూరు కాపు సామాజిక భవన నిర్మాణానికి మంత్రి జోగు రామన్న - ప్ర‌భుత్వ విప్ ఓదెలు - స్థానిక‌ ఎమ్మెల్యే దివాకర్‌ రావు భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి - ఎమ్మెల్యే - టీఆర్‌ ఎస్ కార్యకర్తలు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. కేసీఆర్ జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని కేక్‌ ను కట్‌ చేశారు. అనంత‌రం టపాసులు కాల్చడం మొదలుపెట్టారు.

అయితే, ఈ స‌మ‌యంలో అపశృతి దొర్లింది. భారీ సంఖ్య‌లో కాల్చిన టపాసుల కారణంగా మంటలు చెలరేగాయి. అవికాస్త టెంట్‌ కు - ఇతర ఫర్నీచర్‌ కు అంటుకోవడంతో అగ్నికి అవి ఆహుతి అయ్యాయి. అప్రమత్తమైన నేతలు - కార్యకర్తలు - పోలీసులు.. షామియానా కింది నుంచి పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో మంత్రి జోగు రామన్న - ఎమ్మెల్యే దివాకర్‌ రావు - ఇతర నేతలు సురక్షితంగా బయటపడ్డారు. షామియానా - వేదిక - కుర్చీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంత్రి - ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడటంతో కార్యకర్తలు - పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే ఇది జ‌రిగింద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

ఇదిలాఉండ‌గా... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రప‌తి రామ్‌ నాథ్ కోవింద్‌ - ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్ష‌లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి.. ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, కేసీఆర్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని - మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మోడీ ఆకాంక్షించారు. మ‌రోవైపు కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా.. ఆయన అభిమానులు - టీఆర్‌ ఎస్ కార్యకర్తలు కేక్స్ కట్ చేసి.. సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.