Begin typing your search above and press return to search.
జగన్ కు టెన్షన్: ఆరు ఎమ్మెల్సీ సీట్ల ఎంపిక తలనొప్పేనా?
By: Tupaki Desk | 21 Feb 2021 9:40 AM GMTమొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దరఖాస్తుకు చివ రి తేదీ మార్చి 4. మార్చి 15న పోలింగ్ నిర్వహిస్తారు. ఇదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. టీడీపీ నుంచి నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి వైసీపీ నాయకుడు.. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో ఏర్పడిన స్థానం. అదేవిధంగా చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో వైసీపీలో ఒక్కసారిగా జోష్ పెరిగిందనే చెప్పాలి. ఇప్పటి వరకు పదవుల కోసంఎదురు చూస్తున్నవా రిలో ఉత్సాహం పెరిగింది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం లెక్కకు మిక్కిలిగానే నాయకులు ఈ స్థానాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. వీటిలో రెండు స్థానాలను మాత్రం ఇప్పటికే రిజర్వ్ చేశారు. ఒకటి తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి గెలిచి.. హఠాన్మరణం చెందిన బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి ఇవ్వనున్నా రు. అదేవిధంగా చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఒకటి ఖరారు చేస్తారని తెలుస్తోంది. అయితే.. ఎటొచ్చీ.. మిగిలిన నాలుగు సీట్లకు దాదాపు ఆరు నుంచిఏ డుగురు లైన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనేది ఇప్పుడు జగన్‌కు తలనొప్పేనని అంటున్నారు పరిశీలకులు.
గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు కీలక వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్ లు ఎమ్మెల్సీ ల కోసం ఎదురు చూస్తున్నారు వీరిలో మర్రికి ఏకంగా.. జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. `అన్న ను ఎమ్మెల్సీని చేసి.. మన ప్రభుత్వం రాగానే మంత్రిని చేస్తాను` అన్నారు. కానీ.. ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. లేళ్ల అప్పిరెడ్డికి ఇంత పెద్ద హామీ ఇవ్వకపోయినా.. ఎమ్మెల్సీని చేస్తామన్నారు. సో.. ఈ ఇద్దరు కాచుకుని కూర్చున్నారు. ఇక, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు కూడా ఎమ్మెల్సీ ఇస్తామని ఇటీవల హామీ ఇచ్చారు. దీంతో ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా రిటైర్ అవుతున్న మహమ్మద్ ఇక్బాల్ తనను మళ్లీ మండలికి పంపాలని కోరుతున్నారు. పార్టీ కోసం ఎంతో చేసిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యె మోషేన్ రాజు కూడా ఎమ్మెల్సీ కోసం ఆశలు పెట్టుకున్నారు. ఇలా ఉన్న ఆరు స్థానాల్లో పైకి కనిపిస్తున్నవారితో పాటు కనిపించని వారుకూడా ఎంతో మంది పోటీ పడుతున్నారు. వీరిని ఎంపిక చేయడం.. మిగిలిన వారిని బుజ్జగించడం.. జగన్‌కు సవాలేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారం చూడాలి.