Begin typing your search above and press return to search.

సెక్రటేరియట్ లో టెన్షన్..టెన్షన్

By:  Tupaki Desk   |   5 May 2023 10:54 AM GMT
సెక్రటేరియట్ లో టెన్షన్..టెన్షన్
X
ఏ ముహూర్తంలో కేసీయార్ కొత్త సెక్రటేరియట్ ను ప్రారంభించారో కానీ ప్రతిరోజు టెన్షన్ టెన్షనే. ఎందుకంటే పోయిన నెల 30వ తేదీ ప్రారంభించిన దగ్గర నుండి సెక్రటేరియట్ లో కేసీయార్ ప్రతిరోజు అనేక శాఖలను రివ్యూ చేస్తున్నారు. సెక్రటేరియట్ లో కేసీయార్ ఉంటున్నారు కాబట్టి నిరుద్యోగులు, ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు వస్తున్నారు. దీంతో వీళ్ళని లోపలకు పంపకుండా ఆపేందుకు ఇపుడున్న సెక్యూరిటి సరిపోవటంలేదట. అంతేకాకుండా ఏరోజు ఎవరొచ్చి సెక్రటేరియట్ మీదపడతారో కూడా అర్ధంకావటంలేదట.

ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కదా అందుకనే ప్రతిపక్షాలు, నిరుద్యోగులు తదితరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇపుడు కొత్తగా సెక్రటేరియట్ కట్టారు కదా అందుకనే కేసీయార్ ఉంటున్నారు కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ముట్టడికి పిలుపుస్తున్నాయి. దాంతో పై పార్టీల్లోని నేతలు, కార్యకర్తలు ప్రతిరోజు సెక్రటేరియట్ కు చేరకుంటున్నారు. ఇదే సమయంలో నిరుద్యోగులు, టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్ధులు కూడా ఆందోళనలు చేస్తున్నారు.

వీళ్ళంతా ప్రతిరోజు సెక్రటేరియట్ ను చుట్టుముడుతుంటే లోపలంతా గందరగోళంగా ఉంది. వీళ్ళందరినీ లోపలకు ఎంటర్ కాకుండా అడ్డుకోవాలంటే ఇఫుడున్న సెక్యూరిటి చాలదని చీఫ్ సెక్యూరిటి అధికారి సీఎంవోకు ప్రతిపాదనలు పంపారట.

ఇప్పటికే సెక్రటేరియట్ లో 700 మంది పోలీసులు డ్యూటీ చేస్తున్నారు. 700 మంది పోలీసులు డ్యూటి చేస్తున్నారంటే చాలా ఎక్కువమందే ఉన్నట్లు లేక్క. సమైక్య రాష్ట్రంలో ఇన్ని వందల మంది పోలీసులు ఎప్పుడూ డ్యూటీ చేయలేదు.

అలాంటిది ఆందోళనకారులను అడ్డుకునేందుకు మరో 400 మంది పోలీసులు అవసరమని సీఎస్వో ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారట. అదికూడా రెగ్యలర్ గా డ్యూటీ చేయటానికి ఇక్కడే ఉంచాలన్నారు. అంటే 1100 మంది పోలీసులు సెక్రటేరియట్ డ్యూటీకే అవసరమన్నమాట.

మరింతమందిని కేటాయించటం పోలీసు ఉన్నతాధికారులకు సాధ్యమేనా ? ఇంతమందిని కేటాయించినా ఆందోళనలు, సెక్రటేరియట్ ముట్టడిని కంట్రోల్ చేయగలరా ? అన్నదే డౌటు. ఎందుకంటే వచ్చేఎన్నికల్లో ఎలాగైనా బీఆర్ఎస్ ను ఓడించాలని కాంగ్రెస్, బీజేపీలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా ఆందోళనలు చేయటానికి రెడీ అయిపోతున్నాయి.