Begin typing your search above and press return to search.
అమెరికాలో ఎలక్షన్లు అయితే.. తమిళనాడులో టెన్షన్..టెన్షన్
By: Tupaki Desk | 4 Nov 2020 12:10 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచమంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదట్లో డెమొక్రాట్ల తరఫున పోటీచేస్తున్న జో బైడెన్ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ.. క్రమంగా ఆయన హవా తగ్గుతున్నది. ప్రస్తుతం ఓట్లు లెక్కిస్తున్న ప్రాంతాల్లో ట్రంప్ దూసుకుపోతున్నట్టు ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలపై తమిళనాడు ప్రజలు తీవ్ర టెన్షన్‌కు గురువుతున్నారు. అందుకు కారణం డెమొక్రాట్ల తరఫున కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్నారు. ఆమె స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని తులసేంద్రపురం. దీంతో పలు ప్రాంతాల్లో కమలా గెలవాలంటూ పూజలు చేస్తున్నారు. అమెరికాలో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి తమిళ ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయారు.
కమలా గెలవాలని వారు బలంగా కోరుకుంటున్నారు. మరోవైపు పలు ఆలయాల్లో పూజలు కూడా చేస్తున్నారు. కమలా హ్యారిస్ సొంత గ్రామం తులసేంద్రపురంలో అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అక్కడి ఆలయాల్లో నిన్నటి నుంచి నిర్విరామ పూజలు కొనసాగుతున్నాయి. ప్రజలంతా టీవీల ముందు కూర్చొని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఓ యువతి మాట్లాడుతూ.. ‘కమలా నాకు ఆదర్శం. యువత బాగుపడాలంటే కమలా గెలిచి తీరాలి. కానీ కౌంటింగ్ సరళి చూస్తుంటే మాత్రం ప్రస్తుతం నువ్వా నేనా అన్న రేంజ్లో పోటీ కొనసాగుతున్నది. రెండు పార్టీలకు స్వల్ప సంఖ్యలోనే తేడా ఉండటంతో ఎవరు గెలుస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొని ఉన్నది.
ప్రారంభంలో కొన్ని రాష్ట్రాల్లో డెమొక్రాట్ల అభ్యర్థి బైడెన్ ఆధిక్యం కొనసాగించినప్పటికీ.. క్రమంగా వెనకబడి పోతున్నారు. ట్రంప్ కూడా బైడెన్‌కు సమానంగా దూసుకొస్తున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. అమెరికాలో ఎన్నికలు పరోక్ష పద్ధతిలో సాగుతాయి. మొత్తం 538 ఎలక్ట్రోలర్ సీట్లలో సగానికి పైగా సాధించిన వారే విజేతగా నిలుస్తారు. విజయం సాధించాలంటే 270 సీట్లు గెలుపొందాలి. ప్రస్తుతం డెమొక్రాట్ల తరఫున పోటీచేసిన జో బైడెన్ 238 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ట్రంప్ 213 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కానీ ఇప్పడు కౌంటింగ్ జరుగుతున్న పలు రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ట్రంప్ సీట్ల సంఖ్య పెరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేపు ఉదయానికి పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నది.