Begin typing your search above and press return to search.
కిసాన్ పరేడ్ లో ఉద్రిక్తత ... టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు !
By: Tupaki Desk | 26 Jan 2021 8:30 AM GMTగణతంత్ర దినోత్సవం నాడే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా మారింది. మంగళవారం ఉదయాన్నే పోలీసులు పెట్టిన బారికేడ్లను తొలగించి వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్రవేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వారిపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. గత కొన్ని రోజులుగా దేశంలోని రైతులు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
అసలైతే , రాజ్‌పథ్ లో గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత రైతులు తమ ట్రాక్టర్ పరేడ్ చేపట్టడానికి అనుమతి ఇచ్చారు. కానీ రైతులు మాత్రం ఉదయం 8 గంటలకే సరిహద్దులు దాటి ఢిల్లీలోకి దూసుకువచ్చారు. సింఘు, టిక్రీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది జెండాలను పట్టుకొని కనిపించారు. కొందరు ట్రాక్టర్లపై ఢిల్లీలోకి ప్రవేశించారు. కనిపించిన పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. పాండవ్ నగర్ దగ్గర్లో ఢిల్లీ, మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు తొలగించారు. అటు ముకర్బా చౌక్‌లోనూ బారికేడ్లను తొలగించి పోలీసుల వాహనంపై ఎక్కారు. ఓ దశలో రైతులను నియంత్రిందచేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.
మరోవైపు ట్రాక్టర్లతో ఢిల్లీలోని ప్రవేశించిన రైతులపై స్వరూప్ నగర్ లోని స్థానికులు పూల వర్షం కురిపించారు. ఇక, కిసాన్ గణతంత్ర పరేడ్‌లో పాల్గొనేందుకు పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక, రాజ్‌పథ్ లో రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాక. ఈ ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమతించారు. ఢిల్లీ పోలీసులు రైతులకు 3 రోడ్లను కేటాయించారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ఆందోళనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.