Begin typing your search above and press return to search.
తెలంగాణ మంత్రులకు టెన్షన్.. టెన్షన్
By: Tupaki Desk | 11 Oct 2020 1:30 AM GMTగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తెలంగాణ మంత్రులకు సెగ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులకు ఇవి పరీక్షగా మారాయి. ఇప్పుడు వారంతా తెగ టెన్షన్ పడుతున్నారట.. ఏమాత్రం తేడా వచ్చినా తమ పదవులకు ముప్పు తప్పదని ఆందోళన చెందుతున్నారట..
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రక్రియ ప్రారంభించింది. నవంబర్ లేదా డిసెంబర్ లో గ్రేటర్ సమరం జరుగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఈసారి మరోసారి సత్తా చాటాలని టీఆర్ఎస్, బలం నిరూపించుకోవాలని కాంగ్రెస్,బీజేపీలు తాపత్రయపడుతున్నాయి., మధ్యలో ఎంఐఎం కూడా భారీగా వ్యూహరచన చేస్తోంది. మొత్తం 150 డివిజన్లలో జీహెచ్ఎంసీలో ప్రస్తుతం టీఆర్ఎస్ కు 99 కార్పొరేటర్లు ఉన్నారు. ఈసారి సెంచరీ కొడుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కేటీఆర్ రంగంలోకి దిగారు.
అయితే ముఖ్యంగా ఈ గ్రేటర్ పరీక్ష జీహెచ్ఎంసీ పరిధిలోని నలుగురు మంత్రులకు అగ్ని పరీక్షగా మారింది. మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలకు ఈ ఎన్నికలు పరీక్ష కాబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే టీఆర్ఎస్ 18 నియోజకవర్గాలను ఇన్ చార్జీలను నియమించి మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యత అంతా మంత్రులదేనని తేల్చిచెప్పారు. దాంతో మంత్రులంతా కష్టపడుతున్నారు. తేడా వస్తే మంత్రి పదవులే పోతాయన్న కేసీఆర్ హెచ్చరికతో మంత్రుల్లో ఇప్పుడు ‘జీహెచ్ఎంసీ’ ఎన్నికల టెన్షన్ మొదలైందని అంటున్నారు.