Begin typing your search above and press return to search.

సిట్టింగుల్లో టెన్షన్ మొదలైందా ?

By:  Tupaki Desk   |   6 April 2023 9:35 AM GMT
సిట్టింగుల్లో టెన్షన్ మొదలైందా ?
X
జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రారంభించబోతున్న 'జగనన్నకు చెబుదాం' అనే కార్యక్రమం కొందరు మంత్రులు, సిట్టింగుల్లో టెన్షన్ పెంచేస్తోందట. పై కార్యక్రమాన్ని జగన్ ఈనెల 13వ తేదీన ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యే అందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ప్రత్యేకంగా మొబైల్ నెంబర్లు, ప్రత్యేక సెల్, మానిటర్ చేసేందుకు అధికారులు, సిబ్బందిని కూడా ఏర్పాటుచేసింది. నిజానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం సమస్యలు పరిష్కారం కానివాళ్ళు, పరిష్కారంలో బాగా ఆలస్యమవుతున్న వాళ్ళు చెప్పుకునేందుకే.

కానీ ఇదే కార్యక్రమాన్ని పార్టీలోని అసంతృప్తులు కూడా ఉపయోగించుకుంటారేమో అనే టెన్షన్ పెరిగిపోతోందట. కొందరు మంత్రులు, సిట్టింగ్ ఎంఎల్ఏల మీద పార్టీ నేతలు, క్యాడర్లో అసంతృప్తి పెరిగిపోతోంది. తమ అసంతృప్తిని డైరెక్టుగా జగన్ తో చెప్పుకునేందుకు అసంతృప్తుల్లో చాలామందికి ఎప్పటికీ అవకాశం రాదు. అలాంటి వాళ్ళంతా ఇపుడీ కార్యక్రమంలో యాక్టివ్ అయిపోయి తమ మీద ఫిర్యాదులు చేస్తారేమో అనే టెన్షన్ కొందరిలో పెరిగిపోతోందట.

పార్టీలోని అసంతృప్తుల ద్వారా తమ వ్యవహారాలన్నీ జగన్ దృష్టిలో పడితే తమ పరిస్ధితి ఏమిటనే ఆందోళన పెరిగిపోతోందట. సూళ్ళూరుపేట, మడకశిర, హిందుపురం, కావలి, ఉదయగిరి, మైలవరం లాంటి మరికొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో వివాదాలు ఎక్కువగా ఉన్నాయి.

మంత్రులు, ఎంఎల్ఏల వ్యవహారాలపై నేతలు, క్యాడర్ మండిపోతున్నారు. ఇలాంటి వాళ్ళంతా ఇపుడు తమ ఫిర్యాదులు చేస్తారేమో అని మంత్రులు, ఎంఎల్ఏలు భావిస్తున్నట్లు పార్టీలోనే టాక్ నడుస్తోంది.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందన్నది ఒకందుకైతే కార్యక్రమంలో జరిగేది మరోటైతే తమ పరిస్ధితి ఏమిటనేది ఇపుడు ప్రశ్న. సమస్య ఎలాంటిదైనా ప్రత్యేక సెల్ లో పనిచేసేవారు నోట్ చేసుకుని ఆయా శాఖలకు పంపిస్తారు. అలాగే అసంతృప్తుల ఫిర్యాదులను కూడా జగన్ కు పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు టెన్షన్ పడుతున్నారు.

మరి పరిస్ధితిని ఇంతవరకు తెచ్చుకోవటం ఎందుకు ? ఇపుడు టెన్షన్ పడటం ఎందుకు ? మొత్తం మీద జగన్ ప్రారంభించబోతున్న గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం చివరకు ఎటు వెళుతుందో చూడాలని ఆసక్తి పెరిగిపోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.e వద్దు.