Begin typing your search above and press return to search.

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్

By:  Tupaki Desk   |   28 Nov 2022 1:30 AM GMT
చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్
X
వైసీపీ ఎమ్మెల్యేలు బెంగటిల్లుతున్నారు. తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా రాదా అన్న కలవరం వారిలో నెలకొంది. గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ జనంలో తిరుగుతున్న వారికి కూడా టికెట్ వస్తుంది అన్న నమ్మకం అయితే లేదు అంటున్నారు. దానికి కారణం చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలలో అత్యధిక శాతం ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగానే సర్వే నివేదికలు ఉన్నాయని అంటున్నారు.

వైసీపీకి నిజానికి పెట్టని కోట చిత్తూరు జిల్లా అని చెబుతున్నారు. ఈ జిల్లాలో బలమైన నాయకులు ఆ పార్టీని ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ జిల్లాను తన నియనత్రణలోకి తీసుకుని నడిపిస్తున్నారు. 2019 ఎన్నికల తరువాత అన్ని స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధించింది. అలాగే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో సైతం వైసీపీ లోకల్ బాడీస్ లో జెండా ఎగరేసింది.

ఆలాంటి వైసీపీ కుప్పం సీటుని వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని చెబుతోంది కానీ వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీస్ మాత్రం భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యమంగా ఐ ప్యాక్ టీం సర్వేలు ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారాయని అంటున్నారు. వారి సర్వేలనే తీసుకుంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు హుళక్కే అని అంటున్నారు.

ఇక కుప్పంలో టీడీపీ ఇపుడు ఆధిక్యంలో ఉంది అని ఐప్యాక్ టీం సర్వేలే చెబుతున్నాయి. అలాగే నగరి, పలమనేరు నియోజకావర్గాలలో టీడీపీ గ్రాఫ్ బాగా పెరిగింది అని అంటున్నారు. దాంతో పాటు ఎస్సీ రిజర్వ్ సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలకు కూడా దూరంగా ఉంటున్నారు అని సర్వే నివేదికలు చెబుతున్నాయి. మరో వైపు చూస్తే సీనియర్ నేతలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తమ వారసులను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారు.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే వైసీపీకి అత్యంత బలమైన చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయన్నది కనుక చూస్తే టీడీపీ గట్టిగా ఉందన్న వార్తలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి అని అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మొత్తానికి మొత్తం 175 సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నా అది గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ కి ఏ మాత్రం పొంతన లేకుండా ఉంది అని అంటున్నారు.

మరి వైసీపీకి బలమైన జిల్లాలోనే ఈ రకమైన పరిస్థితి ఉంటే ఇక మిగిలిన చోట్ల ఎలా అన్న చర్చ కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సర్వేలు తమకు యాంటీగా ఉన్నాయని తెలుసుకున్న పలువురు ఎమ్మెల్యేలు మాత్రం టెన్షన్ లో ఉన్నారని అంటున్నారు. పరిస్థితి మెరుగుపడకపోతే టికెట్ కి టిక్కు పెట్టేస్తారు అన్నది వారికి తెలియనిది కాదు, అందుకే వారు ఇపుడు కంగారు పడుతున్నారుట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.