Begin typing your search above and press return to search.
తమిళనాడులో మళ్ళీ టెన్షన్..టెన్షన్ కన్యాకుమారిలో సముద్రం వెనక్కి
By: Tupaki Desk | 5 Oct 2020 12:42 AM GMTతమిళనాడు రాష్ట్రంలో మళ్ళీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు కారణం ఆ రాష్ట్రంలోని కన్యాకుమారి తీరంలో సముద్రం వెనక్కి వెళ్ళడమే. 2004లో కన్యాకుమారి తీరంలో ఇలా సముద్రం తీరం వెనక్కి వెళ్ళిన తర్వాతే సునామీ వచ్చింది. చెన్నై నగరాన్ని, కన్యాకుమారి తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. సుమారు 8 వేల మంది వరద నీటిలో కొట్టుకుపోయారు. అంతటి విపత్తు ఆ రాష్ట్రంలో మునుపెన్నడూ జరగలేదు. దాని నుంచి కోలుకోవడానికి ఆ రాష్ట్రానికి చాలా సమయమే పట్టింది. అప్పటి నుంచి తీర ప్రాంతాల్లో సముద్రం వెనక్కి వెళ్తే చాలు ఆ రాష్ట్ర ప్రజలు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతుంటారు. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం కలిసే త్రికడలి సంగమం కలిసే చోటే కన్యాకుమారి. ప్రసిద్ధి చెందిన కుమారి అమ్మన్ టెంపుల్ ఇక్కడే ఉంది. తిరువళ్లూర్ రాక్, బీచ్ కూడా ఉండటంతో ఇక్కడికి పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది. కాగా రెండు రోజులుగా కన్యాకుమారి తీరంలో సముద్రమట్టంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు.
గురువారం సాయంత్రం అక్కడ ఉన్నట్టుండి సముద్రం వెనక్కి వెళ్లింది. రాత్రంతా అలాగే ఉన్న సముద్ర మట్టం ఉదయం మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. శుక్రవారం రాత్రి మళ్లీ నీళ్లు వెనక్కి వెళ్ళగా తీరంలోని వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహం వద్ద రాళ్ల గుట్టలు బయటపడ్డాయి. 2004లో సునామీకి ముందు కూడా ఇలాగే సముద్రం వెళ్ళడం, ఆ తరువాత సునామీ రావడం జరిగిందని అక్కడి జాలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఆనాటి పరిస్థితులు పునరావృతం అవుతాయేమోనని భయపడుతున్నారు. కాగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రం ఇలా అప్పుడప్పుడు వెనక్కి వెళుతుంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.