Begin typing your search above and press return to search.

కవితకు మళ్లీ టెన్షన్.. కొత్త ఉపద్రవం ఏంటంటే..?

By:  Tupaki Desk   |   3 Jan 2023 9:30 AM GMT
కవితకు మళ్లీ టెన్షన్.. కొత్త ఉపద్రవం ఏంటంటే..?
X
ఢిల్లీ లిక్కర్ స్కాం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన వారి రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈ స్కాం కేసులో 5న ఈడీ చార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ నేపథ్యంలో ఇందులో ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ టెన్షన్ మొదలైంది. నిందితుల రిమాండ్ పొడగింపుతో విచారణ మరోసారి కొనసాగనుందా..?

అన్న చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా కవిత మరోసారి విచారణను ఎదుర్కొంటారా..? అని అనుకుంటున్నారు. గత నెల 11న ఎమ్మెల్సీ కవితను విచారించిన ఈడీ అధికారులు ఆమెను సాక్షిగా చేర్చి పలు వివరాలను రికార్డు చేశారు. దీంతో అక్కడికే అయిపోయిందని అనుకున్నారు. కానీ తాజాగా నిందితుల రిమాండ్ పొడగింపుతో పాటు 5న చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుండడంతో ఏం జరుగుతోందోననే ఉత్కంఠ నెలకొంది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి అరెస్టయిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణకు చెందిన శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిలను కూడా ఈ స్కాంలో నిందితులుగా చేర్చారు. అయితే నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ కుంభకోణంలో భాగస్వామి అని, ఆమె అత్యధికంగా లబ్ధిపొందుతారని ఎన్ ఫోర్స్ మెండ్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. కవితతో పాటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అతడి కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిదో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లను కూడా ఈ డీ తెలిపింది.

ఇండోస్పిరిట్ సంస్థ అసలు భాగస్వాములు మాగుంట రాఘవ్ రెడ్డి, కవిత అని ఈడీ తెలిపింది. ఈ సంస్థకు ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఇండోస్పిరిట్ సంస్థకు చెందిన రామచంద్ర పిళ్లై వెనుక ఉన్నది కవిత అని తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ్ రెడ్డి తుపున ప్రేమ్ రాహుల్ పనిచేస్తున్నారని, రిటైల్ లో 14కోట్ల బాటిళ్లను విక్రయించడం ద్వారా రూ.195 కోట్లను సంపాదించినట్లు ఈడీ పేర్కొంది. చార్జిషీట్ ప్రకారం కవిత నేరుగా ఢిల్లీలోని స్టార్ హోటళ్లలో, హైదరాబాద్ లోని తన నివాసంలో కలుస్తూ ఉండేవారని తెలిపింది.

అయితే తాజాగా ఈ కేసుపై ఈడీ 5న చార్జీషీటు దాఖలు చేయనుంది. ఇప్పటికే కవిత నుంచి వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు ఆమె పేరు కూడా చేర్చారా..? అని అనుకుంటున్నారు. ఒకవేళ కవిత పేరు ఉంటే ఆ తరువాత ఏం జరగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఈడీ అడిగిన ప్రశ్నలకు జవాబలు అందించానని చెబుతున్న కవిత తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.