Begin typing your search above and press return to search.

తాడిపత్రిలో తగ్గని వేడి.. పెద్దారెడ్డి , జేసీ ఇళ్ల దగ్గర టెన్షన్

By:  Tupaki Desk   |   25 Dec 2020 5:30 PM GMT
తాడిపత్రిలో తగ్గని వేడి..  పెద్దారెడ్డి , జేసీ ఇళ్ల దగ్గర టెన్షన్
X
అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిన్న జరిగిన రచ్చ ఏపీ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వైసీపీ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి జేసీ ఇంటికి వెళ్లడం.. అక్కడ ఘర్షణలు చోటుచేసుకోవడం తెలిసిందే.

ఆ ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. తాడిపత్రి కేంద్రంగా హైటెన్షన్ నెలకొంది. ఇవాళ రెండోరోజు కూడా అదే పరిస్థితి ఉంది.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి పరిసరాలు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. డ్రోన్ కెమెరాలతో ఆ ప్రాంతంపై పోలీసులు నిఘా పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటివద్ద అదనంగా సీసీ టీవీ కెమెరాలను అమర్చుతున్నారు. ప్రస్తుతం జేసీ దాడి చేసిన ఇంట్లోనే ఉన్నారు.

ఇక అధికార వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా ఇలాంటి పరిస్థితియే నెలకొంది. అక్కడ కూడా గట్టి భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు. దాడులు, ప్రతిదాడులకు అవకాశం ఉండడంతో హై అలెర్ట్ నెలకొంది.

ట్విస్ట్ ఏంటంటే పెద్దారెడ్డి ఇంటికి సమీపంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు ఉంది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.