Begin typing your search above and press return to search.

బికినీ ఫొటోతో ఐడీ కార్డ్ ఇచ్చిన నిర్వాహకులు.. షాకైన టెన్నిస్ స్టార్

By:  Tupaki Desk   |   20 Aug 2022 9:52 AM GMT
బికినీ ఫొటోతో ఐడీ కార్డ్ ఇచ్చిన నిర్వాహకులు.. షాకైన టెన్నిస్ స్టార్
X
ఐడీ కార్డు.. అది ఉంటేనే ఒక సంస్థలోకి కానీ.. ఏదైనా కార్యక్రమంలోకి కానీ ఎంట్రీ ఉంటుంది. అందులోని ఫొటోలను లైవ్ లో ఉన్నవే తీసుకొని ఇస్తారు. కానీ ఈ నిర్వాహకులు మాత్రం ఏకంగా టెన్నిస్ స్టార్ బికినీ ఫొటో పెట్టేశారు. అదీ మరీ వల్గర్ గా ఉన్న ఫొటో.. అన్ని అంగాలు కనిపిస్తున్న ఫొటో. దాన్ని ఐడీ కార్డుపై పెట్టి ఇవ్వడంతో ఆ టెన్నిస్ స్టార్ షాక్ అయిపోయింది.

కొన్ని క్రీడల్లో ఐడీ కార్డు తప్పనిసరి. క్రికెట్, ఫుట్ బాల్, కబడ్డీ, హాకీ లాంటి గ్రూప్ క్రీడలకు ఐడీకార్డులు లేకపోయినప్పటికీ టెన్నిస్, బ్యాడ్మింటన్, చెస్ లాంటి క్రీడల్లో ఐడీ కార్డులు తయారు చేసి క్రీడాకారుల ఫొటోలు పెట్టి ఇస్తారు. అవి ఉంటేనే ఆటగాళ్లను అనుమతిస్తారు. ఈ ఐడీ కార్డు కారణంగానే కెనడా మహిళా టెన్నిస్ ప్లేయర్ యూజీని బౌచర్డ్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది.

తాజాగా వాంకోవర్ లో 'ఓల్డమ్ బ్రౌన్ వాన్ ' ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు తాజాగా కెనడా మహిళా ప్లేయర్ యూజీనీ బౌచర్డ్ వచ్చారు. తొలి రౌండ్ మ్యాచ్ సమయంలో బౌచర్డ్ తన ఐడీ కార్డు చూసుకొని షాక్ అయ్యారు.

ఐడీకార్డుపై బౌచర్డ్ సాధారణ ఫొటోకు బదులు.. టూ పీస్ బికినీ ధరించిన ఫొటో పెట్టారు. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను టెన్నిస్ అధికారులు అతికించి ఐడీ కార్డు తయారు చేసి ఇచ్చారు. ఇది చూసి యూజీని అవాక్కైంది.

2018లో ఓ స్పోర్ట్స్ మ్యాగజైన్ కు సంబంధించి కవర్ షూట్ కోసం యూజీని బౌచర్డ్ ఈ స్విమ్ సూట్ ధరించారు. ఆ ఫొటో ఐడీ కార్డుపై ఉండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ ఫొటోపై బౌచర్డ్ ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఫన్నీగా స్పందించారు.

ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఫొటో షేర్ చేసి.. ఈ ఫొటోనే ఎందుకు వాడారో చెప్పాలని ప్రశ్నించారు. ఈమె ప్రశ్నించడంతో చివరకు ఐడీ కార్డును మార్చేశారు నిర్వాహకులు. కానీ ఈ చర్య మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.