Begin typing your search above and press return to search.

పందెంలో ఓడి డేట్ కు వెళ్లిన టెన్నిస్ స్టార్

By:  Tupaki Desk   |   7 Feb 2017 9:05 AM GMT
పందెంలో ఓడి డేట్ కు వెళ్లిన టెన్నిస్ స్టార్
X
విస్మయాన్ని రేకెత్తించే విషయంగా దీన్ని చెప్పాలి. ఆమె ఒక టెన్నిస్ స్టార్. అతడో సాదాసీదా అభిమాని. ఇద్దరి మధ్య అనుబంధం కేవలం ట్విట్టర్ లో ట్వీట్స్ చేయటమే. అదే ఆమెకు ఊహించని షాక్ ను ఇచ్చింది. ఒక ప్రముఖ టెన్నిస్ స్టార్ కు ఎదురైన రియల్ అనుభవం సినిమాటిక్ గా ఉండటమే కాదు.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గుర్తు తెలియని ఫ్యాన్ తో పందెం కట్టి.. ఓడిపోయి అతడితో డేట్ కు వెళ్లిన ఈ విచిత్ర ఉదంతంలోకి వెళితే..

కెనడాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ యుజిని బౌచర్డ్. 22 ఏళ్ల ఈ టెన్నిస్ క్రీడాకారిణి టాప్ స్టార్లలో ఒకరు. ఒక ఫుట్ బాల్ మ్యాచ్ (అట్లాంటా ఫాల్కన్స్ – న్యూఇంగ్లండ్ పేట్రియాట్స్)ను చూస్తున్న ఆమె.. అట్లాంటా జట్టు 21-0 స్కోర్ తో లీడ్ లో ఉండటంతో ఆ జట్టు గెలుస్తుందని ట్వీట్ చేసింది. దీనికి బౌచర్డ్ అనే అభిమాని ఒకరు అందుకు భిన్నంగా పేట్రియాట్స్ జట్టు గెలుస్తుందని చెబుతూ.. అలా జరిగితే నాతో డేట్ కి వస్తావా? అంటూ అడిగాడు.

అందుకు రియాక్ట్ అయిన టెన్నిస్ స్టార్ ఓకే చెప్పేసింది. అయితే.. పేట్రియాట్స్ జట్టుకు చెందిన టామ్ బ్రాడీ ఆటగాడి అద్భుత ఆటతో ఆ జట్టు సంచలన విజయం సాధించింది. దీంతో.. సదరు అభిమాని ట్వీట్ చేస్తూ.. ఆందోళన పడుతున్నావా? అంటూ ట్వీట్ చేశాడు. అవును.. కొంచెం అంటూ సమధానం ఇచ్చిన యుజిని.. అభిమాని ఎక్కడ ఉంటాడంటూ ఆరా తీసింది.

కట్ చేస్తే.. పందెంలో ఓడిన తను తెలియని అభిమానితో డేట్ కు వెళ్లినట్లుగా తాజా ట్వీట్ లో వెల్లడించింది. అంతేకాదు.. టామ్ బ్రాడీ ఆడే జట్టుకు వ్యతిరేకంగా ఎప్పుడు బెట్ చేయకూడదన్న గుణపాఠాన్ని తానునేర్చుకున్నట్లుగా వెల్లడించింది. ఈ ఉదంతం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/