Begin typing your search above and press return to search.

ఈ పాపం ఎవ్వరిది? అప్పుడే పుట్టిన 10 మంది పసికందులు అగ్నికి ఆహుతయ్యారు..!

By:  Tupaki Desk   |   9 Jan 2021 6:00 AM GMT
ఈ పాపం ఎవ్వరిది? అప్పుడే పుట్టిన 10 మంది పసికందులు అగ్నికి ఆహుతయ్యారు..!
X
మహారాష్ట్ర భందరా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. అప్పుడే పుట్టిన 10 మంది నవజాత శిశువులు అగ్నికి ఆహుతయ్యారు. ఏ ప్రమాదం ఎలా జరిగిందే తెలియదు. ఎవరి నిర్లక్ష్యమే అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి ఐసీయూలో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 10 మంది శిశువులు పొగకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆస్పత్రి సిబ్బంది కొందరిని కాపాడగలిగారు. ఆస్పత్రిలోనే పిల్లలు చనిపోవడంతో ఆ తల్లిండ్రులకు కడుపుకోత మిగిలింది. ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకే సారి పది మంది నవజాతా శిశువులు మృత్యుపాలవడంతో నివ్వెర బోతున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు చెలరేగినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆ సమయంలో 17 మంది చిన్నారులు ఉన్నారు. అక్కడున్న ఆస్పత్రి సిబ్బంది ఏడుగురు చిన్నారులను కాపాడగలిగారు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది. ఐసీయూలో షార్ట్​ సర్క్యూట్​ అయ్యిందా? మంటలు ఎలా వ్యాపించాయి అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఇటీవల కాలంలో ఆస్పత్రిలో మంటలు చెలరేగే ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. కొంత కాలం క్రితం ఏపీలోని విజయవాడలోని స్వర్ణప్యాలెస్​లో మంటలు చెలరేగి ఐసీయూలో చికిత్స పొందుతున్న కోవిడ్​ పేషెంట్లు చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఒకే సారి పది మంది పసి కందులు కన్నుమూయడం విషాదంగా మారింది.