Begin typing your search above and press return to search.

తమిళనాడులో అమ్మకి ఆలయం .. సీఎం చేతుల మీదుగా నేడే ప్రారంభం !

By:  Tupaki Desk   |   30 Jan 2021 6:45 AM GMT
తమిళనాడులో అమ్మకి  ఆలయం .. సీఎం చేతుల మీదుగా నేడే ప్రారంభం !
X
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి .. అన్నాడీఎంకే శ్రేణుల అమ్మకి అక్కడ ఎంతటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె మరణించి ఏళ్లు గడుస్తున్నా కూడా అమ్మని అక్కడి ప్రజలు మరచిపోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే .. తమిళనాడు రెవిన్యూశాఖామంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్ అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆలయం నిర్మించారు. య కన్నుమూసి ఐదేళ్లవుతున్నా అమ్మపై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు. తన లోని భక్తి ప్రపత్తులను పదికాలాల పాటు పదిలం చేసుకునేలా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్‌బీ ఉదయ్ కుమార్‌ అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆలయం నిర్మించారు.

మదురై జిల్లా తిరుమంగళం సమీపం టీకున్రత్తూరులో రూపుదిద్దుకు న్న ఈ ఆలయాన్ని ముఖ్య మంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సె ల్వం నేడు శనివారం ప్రారంభించనున్నారు.ఇందు కోసం మంత్రి ఉదయకుమార్‌ కొన్నిరోజుల క్రితమే కాషాయవస్త్రాలు ధరించి దీక్షబూనారు. ప్రజలు సందర్శించుకునేందుకు వీలుగా 12 ఎకరాల విస్తీర్ణంలో ని ర్మించిన ఈ ఆలయంలో మూలవిరాట్టులుగా అన్నాడీ ఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్, జయలలితల ఏడు అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాలను ప్రతిష్టించారు. ఒక్కో విగ్రహం 40 కిలోల బరువుతో రూపొందించారు. ఆలయ ప్రాంగణంలో పలు కళారూపాలను చెక్కించారు. ప్రధాన గాలిగోపురంపై కలశాలను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం కోసం యాగశాలను, 11 హోమగుండాలను సిద్ధం చేశారు. ఇక అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు.