Begin typing your search above and press return to search.

సుహాసినికి తొలి దెబ్బ.. టీఆర్ ఎస్ లోకి నేతలు

By:  Tupaki Desk   |   24 Nov 2018 10:40 AM GMT
సుహాసినికి తొలి దెబ్బ.. టీఆర్ ఎస్ లోకి నేతలు
X
కూకట్ పల్లి సీటు టీడీపీలో చిచ్చు పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సీటును నందమూరి సుహాసినికి కేటాయించడంతో సీటు ఆశించిన కూకట్ పల్లి నేతలు నిరాశలో మునిగిపోయారు. తాజాగా కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగిన నందమూరి సుహాసినికి షాక్ తగిలింది. టీడీపీ పార్టీ నుంచి ఒక వికెట్ పడిపోయింది. కూకట్ పల్లి టీడీపీకి చెందిన మాధవరం రంగారావు తాజాగా కేటీఆర్ ను కలిసి టీఆర్ ఎస్ లో చేరారు.

రంగారావు టీడీపీలో బలమైన నేత. ఈయన కూకట్ పల్లి నుంచి కానీ శేర్ లింగంపల్లి నుంచి కానీ టీడీపీ టికెట్ ఆశించారు. కూకట్ పల్లి నుంచి సుహాసినిని టీడీపీ ప్రకటించగానే ఆయన నిరాశ చెందారు. అసమ్మతి రాజేశారు. టీడీపీ ప్రచారానికి కూడా దూరంగా జరిగారు. తాజాగా కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరడంతో టీడీపీకి షాక్ తగిలినట్టైంది.

టీడీపీలో ఉన్నప్పుడు రంగారావు కూకట్ పల్లిలోని వివేకానందనగర్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ గా పనిచేశారు. గడిచిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో రంగారావు భార్యకు టీడీపీ కార్పొరేటర్ టికెట్ ఇప్పించుకొని పోటీ చేయించారు. తాజాగా టిడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ మాధవరం రంగారావును స్థానిక ఎమ్మెల్యేలైనా మాధవరం కృష్ణారావు - అరికెపూడి గాంధీ - స్థానిక నేతలందరూ చేరదీసి టీఆర్ ఎస్ లో చేర్పించారు. దీంతో ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన సుహాసినికి తొలి అసమ్మతి బెడద మొదలైంది. మరి ఈ అసమ్మతి నుంచి ఆమె ఎలా గెలుస్తుందనేది వేచి చూడాల్సిందే..