Begin typing your search above and press return to search.

ఎందబ్బా ఈ వైసీపీ కార్పొరేటర్స్ తెలుగు పదాలు

By:  Tupaki Desk   |   18 March 2021 4:53 PM GMT
ఎందబ్బా ఈ వైసీపీ కార్పొరేటర్స్ తెలుగు పదాలు
X
అప్పుడెప్పుడో తెలంగాణ ఏర్పడ్డాక తొలి అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలు చేసిన ప్రమాణ స్వీకారంలో తప్పులు దొర్లి వారంతా నవ్వులపాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి ఉదంతమే చోటుచేసుకుంది. నేతలంటే బాగా చదువుకొని పరిజ్ఞానం కలవారు అనుకుంటే మీరు పొరపడినట్లే.. క్షేత్రస్థాయిలో కార్పొరేటర్లుగా పరపతి ఉన్న వారు.. చదువు అంతగా రాని వారు కూడా ఈసారి పోటీచేసి గెలిచారు.. ఇప్పుడు వాళ్లు కనీసం ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా తటపటాయించిన వైనం వెలుగుచూసింది.

తాజాగా తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఐదుగురు పైగా కార్పొరేటర్లు అస్సలు తెలుగు భాషను స్పష్టంగా చెప్పేందుకు నానా తంటాలు పడ్డారు. పదం పదానికి కూడా పలకలేక తడబడ్డ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రమాణ స్వీకారం వేళ నవ్వులు పూశాయి.

వైసీపీ కార్పొరేటర్ల ప్రమాణాన్ని చూసి సొంత పార్టీ నేతలే గొల్లున నవ్వుకోవడం విశేషం. ఇక ప్రమాణ స్వీకారం చేయిస్తున్న కలెక్టర్ కూడా కొన్ని తెలుగు మాటలు పలికేటప్పుడు తడబడడం విశేషం.ఇప్పుడీ ప్రమాణ స్వీకార వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కనీసం ప్రమాణం కూడా చేయరాని నేతలు ఎలా పాలిస్తారంటూ సెటైర్లు పడుతున్నాయి.