Begin typing your search above and press return to search.
తెలుగమ్మాయి మృతి.. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గులా బెంగళూరు నగరపాలక సంస్థ తీరు!
By: Tupaki Desk | 23 May 2023 2:00 PM GMTబెంగళూరు నగరాన్ని చూడటానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి భారీ వానల్లో చిక్కుకుని తెలుగమ్మాయి భానురేఖ (23) మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని తేలప్రోలుకు చెందిన భానురేఖ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు నగరంలో పర్యటిస్తుండగా వీరు ప్రయాణిస్తున్న అండర్ పాస్ లో వాన నీటిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కారు మునిగిపోవడంతో భానురేఖ మృత్యువాత పడింది.
ఈ ఘటనపై సాక్షాత్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. అంతేకాకుండా ఆస్పత్రికి వెళ్లి భానురేఖ మృతదేహానికి నివాళులు అర్పించారు. రూ.5 లక్షల నష్టపరిహారం కూడా ప్రకటించారు.
కాగా ఊరంతా ఒక దారయితే ఉలిపికట్టది ఒకదారి అన్నట్టు బెంగళూరు నగరపాలక సంస్థ తీరు వివాదాస్పదమైంది. భానురేఖ మృతిపై ఒక నివేదిక ఇంటర్నల్ గా విడుదల చేసిన బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ ఈ ఘటనకు సంబంధించి తమ తప్పు లేదని తేల్చింది. ఆమె మృత్యువాత స్వయంకృతాపరాధమని వెల్లడించింది.
ఈ ఘటనపై.. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరు నగరపాలక సంస్థ తన నివేదికలో ఈ ఘటనలో తప్పు తేల్చిచెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం... ‘‘భానురేఖ కుటుంబం కారులో ప్రయాణిస్తున్న సమయంలో కేఆర్ సర్కిల్ అండర్ పాస్ కింద నీరు చేరింది. డ్రైవర్ అక్కడే ఉన్న బారికేడ్లను కూడా పట్టించుకోకుండా ముందుకు పోనిచ్చారు. ఆ సమయంలో కొందరు అక్కడే ఉండి కేకలు వేస్తూ వద్దని వారించారు. డ్రైవర్‌ను అడ్డుకునే అవకాశం ఉన్నా.. భానురేఖ ఆ పని చేయలేదు’’ అని పేర్కొంది. భానురేఖ మృతిలో కార్పొరేషన్ తప్పు ఏమీ లేదని.. పౌర సేవల విషయంలో తమ తరఫు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోలేదని మునిసిపల్ కార్పొరేషన్ తన నివేదికలో వెల్లడించింది.
అలాగే.. ఘటన నాడు భారీ వర్షం కురిసిందని.. ఈదురుగాలుల ధాటికి ఎండుటాకులు, చెట్ల కొమ్మలు నేలరాలాయని, వర్షంతో కలిసి అవి కేఆర్ అండర్‌పాస్ వద్ద నీరు నిలిచిపోవడానికి కారణం అయ్యాయని బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ తన నివేదికలో తెలిపింది. కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ.. దాని సామర్థ్యానికి మించి నీరు రావడం, ఆకులు.. కొమ్మలు అడ్డుపడడంతో నీరు నిలిచిపోయిందని పేర్కొంది.
కాగా ఘటనలో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని బెంగళూరు నగరపాలక సంస్థ తప్పించుకోవడం.. తప్పంతా మృతురాలు భానురేఖదేనని తేల్చడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. నగరపాలక సంస్థ నివేదిక ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు దాని తీరును తప్పుబట్టారు. ఘటనకు ముమ్మాటికీ నగరపాలక సంస్థ కారణమంటూ ధ్వజమెత్తుతున్నారు.
మరోవైపు ఈ దుర్ఘటనపై భానురేఖ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మునిసిపల్ కార్పొరేషన్ తోపాటు డ్రైవర్ హరీష్ గౌడ నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందని హలసూరు గేట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
మరోవైపు భానురేఖ అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన కృష్ణా జిల్లా తేలప్రోలులో జరిగాయి. భానురేఖ మృతదేహానికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, తదితరులు నివాళులు అర్పించారు.