Begin typing your search above and press return to search.
అమెరికాలో బోటు ప్రమాదం..తెలుగుయువకుడి దుర్మరణం
By: Tupaki Desk | 10 March 2018 10:15 PM ISTఅగ్రరాజ్యం అమెరికాలో తెలుగు యువకుడు దుర్మరణం పాలయ్యాడు. అనూహ్య రీతిలో జరిగిన బోటు ప్రమాదం కారణంగా దేవినేని రాహుల్ అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. ఆయనతో పాటుగా ఆ సమయంలో వెంట ఉన్న ఆయన స్నేహితుడు స్వల్ప గాయలతో ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.
నార్త్ కరోలినాలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న రాహుల్ తన స్నేహితుడితో కలిసి బోటు షికారుకు వెళ్లాడు. అయితే బోటు ప్రమాదానికి గురి అయింది. బోటు మునిగిపోతున్న సమయంలో ఆయన ఎలాంటి లైఫ్ జాకెట్ ధరించలేదు. ప్రమాదం జరిగిన సమయంలో వెంట ఉన్న ఆయన స్నేహితుడు రక్షించాలని బిగ్గరగా కేకలు వేయడంతో...స్థానికులు 911కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో రాహుల్ మృత్యువాత పడగా..ఆయన స్నేహితుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలకు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ సంఘటన విషయంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.