Begin typing your search above and press return to search.

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం..తెలుగోడు మృతి

By:  Tupaki Desk   |   3 July 2017 4:42 AM GMT
అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం..తెలుగోడు మృతి
X
అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో తెలుగు యువ‌కుడు ఒక‌రు మ‌ర‌ణించారు. నార్త్ క‌రోలీనాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో తెలుగు యువ‌కుడు ప్ర‌దీప్ ఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌ర‌ణించారు. భార్య‌.. స్నేహితుల‌తో క‌లిసి వెళుతున్న వాహ‌నం ప్ర‌మాదానికి గురి కావ‌టంతో ప్ర‌దీప్ మ‌ర‌ణించ‌గా.. మ‌రికొంద‌రికి తీవ్ర గాయాలు అయిన‌ట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలోని భువ‌న‌గిరికి చెందిన ప్ర‌దీప్ ఎనిమిదేళ్ల కింద‌ట అమెరికాకు వెళ్లారు. ఐటీ ఇంజ‌నీర్ గా స్థిర‌ప‌డ్డారు. ఏడాది కింద‌టే భువ‌న‌గిరికి చెందిన అమ్మాయితో వివాహం జ‌రిగింది. ఆపై భార్య‌ను అమెరికాకు తీసుకెళ్లారు. ప్ర‌దీప్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వేడుక‌లు నిర్వ‌హించారు. పార్టీ అనంత‌రం స్నేహితుల‌తో క‌లిసి తిరిగి వెళుతున్న వేళ‌.. వారు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ప్ర‌మాదానికి గురైంది.

ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌దీప్ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. ప్ర‌మాద వార్త గురించి తెలిసిన ప్ర‌దీప్ త‌ల్లిదండ్రులు.. బంధువులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. తెలుగోడు మ‌ర‌ణించ‌టంపై.. అక్క‌డి తెలుగు కుటుంబాలు విషాదంలో మునిగాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/