Begin typing your search above and press return to search.

అయ్యో.. ఉన్నత చదువులకు విదేశానికి వెళ్లిన ఏపీ విద్యార్థి కథ విషాదాంతం!

By:  Tupaki Desk   |   6 Nov 2022 9:30 AM GMT
అయ్యో.. ఉన్నత చదువులకు విదేశానికి వెళ్లిన ఏపీ విద్యార్థి కథ విషాదాంతం!
X
ఉన్నత చదువుల కోసం లేదా ఉన్నత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయులు వివిధ ఘటనల్లో మృతిచెందుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి తరచూ చోటు చేసుకోవడం పట్ల అందరిలోనూ ఆవేదన వ్యక్తమవుతోంది.

తాజాగా ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన భారతీయ విద్యార్థి ఒకరు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం అందరిలో విషాదాన్ని నింపింది.

ఈ ఘటన వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం పొలకల పంచాయతీ కొండకిందయల్లంపల్లె గ్రామానికి చెందిన సాయిరోహిత్‌ (28) బీటెక్‌ చేశాడు. తర్వాత ఉన్నత చదువులకోసం 2016లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వెళ్లారు. సాయిరోహిత్‌ ప్రస్తుతం పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ మెల్‌బోర్న్‌లోనే ఉంటున్నాడు.

ఈ క్రమంలో విధులకు వెళ్లడం కోసం మెల్‌బోర్న్‌ నుంచి వేరే ప్రాంతానికి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో కారు గుల్‌బర్‌ వ్యాలీ హైవేలోని సియోమోర్‌ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఉదయం మంచు ఎక్కువగా కురుస్తుండటంతో దారి కనిపించలేదు. దీంతో సాయిరోహిత్‌ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సాయిరోహిత్‌ అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మరణించాడు.

ప్రమాద సమయంలో కారులో ఒక్కడే ఉండటంతో అతడి వివరాలు స్థానికులకు తెలియలేదు. దీంతో వారు ఈ ప్రమాద విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు చూసిన ఆస్ట్రేలియా తెలుగు సంఘం మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. సాయిరోహిత్‌ తండ్రి మోహన్‌నాయుడు 2017లో మరణించారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో అతడి తల్లి కన్నీరు మున్నీరవుతోంది.

సాయిరోహిత్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించడానికి 14 వేల ఆస్ట్రేలియా డాలర్లు ఖర్చవుతుందని కుటుంబసభ్యులు తెలిపారు.