Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

By:  Tupaki Desk   |   23 April 2019 2:23 PM IST
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
X
ఈస్టర్ పండుగ ఓ తెలుగు కుటుంబంలో విషాదాన్ని నింపింది. అమెరికాలో చదువుకుంటున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి విద్యార్థి శ్రావణ్ కుమార్ రెడ్డి మృత్యువాత పడ్డారు. దీంతో శ్రావణ్ కుటుంబ సభ్యులు బెల్లంపల్లిలో శోకసంద్రంలో మునిగిపోయారు.

అమెరికాకు చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థి శ్రావణ్ కుమార్ రెడ్డి ఈస్టర్ పండుగకు సెలవులు దొరకడంతో స్నేహితులతో కలిసి బోస్టన్ బీచ్ కు వెళ్లాడు. అక్కడ సరదాగా స్నానం చేస్తుండగా.. నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

కాగా బాగా అలల ఉధృతికే శ్రావణ్ కుమార్ రెడ్డి సముద్రంలోపలికి కొట్టుకుపోయాడని ప్రత్యక్ష సాక్ష్యులైన అతడి స్నేహితులు తెలిపారు. అతడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు సోమవారం శ్రావణ్ మృతదేహాన్ని బయటకు తీశారు.

ఉన్నత చదువులు చదివి తమ ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు ఇలా అకారణంగా మృతి చెందడంతో బెల్లంపల్లిలో శ్రావణ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నాయి.