Begin typing your search above and press return to search.
ప్రజా ఆరోగ్య ఖర్చులో తెలుగు రాష్ట్రాల చోటెక్కడ?
By: Tupaki Desk | 2 May 2023 12:59 PM GMTఆరోగ్యం కోసం దేశంలో ఏ రాష్ట్రం ఎంత ఖర్చు చేస్తోంది? అందులో తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? దేశంలో ఏ రాష్ట్రం అత్యదికంగా ఖర్చు చేస్తోంది? ఏ రాష్ట్రం అతి తక్కువగా ఖర్చుచేస్తోంది? ఆరోగ్య బీమాకుసంబంధించిన ఖర్చుల మాటేమిటి? లాంటి ఎన్నో ఆసక్తికర విషయాల్ని తాజా రిపోర్టు ఒకటి వెల్లడించింది. ఈ రిపోర్టులో పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగానే కాదు.. ఎంత భారీగా ఖర్చు అవుతుందన్న విషయంపై క్లారిటీ వచ్చే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం.. ప్రైవేటు రంగాల్లో కలిపి ఆరోగ్యంపై చేస్తున్న తలసరి ఖర్చు లెక్క బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇది రూ.5110గా ఉంది.
దేశంలో తెలంగాణలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో కేరళ నిలవగా.. రెండో స్థానంలో హిమాచల్ ప్రదేశ్ నిలచింది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర.. కర్ణాటక హర్యానా.. పంజాబ్ రాష్ట్రాలు నిలిచాయి. తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచింది. చివరి స్థానాల్లో బిహార్ నిలిచింది.
కేరళలో సగటున ఏడాదికి రూ.10,670 ఖర్చు చేస్తూ టాప్ లో నిలిస్తే.. అతి తక్కువగాఖర్చుపెట్టే రాష్ట్రంగా బిహార్ నిలిచింది. కేవలం ఆ రాష్ట్రంలో వైద్యం కోసం రూ.1568 మాత్రమేఖర్చు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం రూ.5,110 చొప్పున ఖర్చుచేస్తున్నారు.
ఏపీలో ఇంకాస్త ఎక్కువగా ఉందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం.. ప్రైవేటు రంగం కలిపి ఆరోగ్యం మీద రూ.18,908 కోట్లు ఖర్చు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ లో ఈ మొత్తం రూ.27,105 కోట్లుగా ఉంది. ఖర్చును రాష్ట్ర జీఎస్ డీపీతో లెక్కిస్తే తెలంగాణలో 2 శాతంగా నిలిస్తే.. ఏపీ 2.8 శాతం కావటం గమనార్హం.
ప్రజారోగ్య బీమాలో తెలంగాణ పదో రాష్ట్రంలో ఉంటే.. కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలోని మొత్తం వైద్య ఖర్చులో 41.6 శాతం ప్రజలు సొంత జేబుల్లో నుంచి ఖర్చు చేస్తుననారు. ఈ అంశంలో దేశంలో అతి తక్కువ ఖర్చు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. అతి తక్కువ ప్రజల ఖర్చుతో కేరళ మొదటి స్థానంలో నిలిచింది.
ఆరోగ్యం కోసం ప్రజలు తమ సొంత జేబుల్లో నుంచి ఖర్చు చేస్తున్న దానిలో భారత దేశం 67వ స్థానంలో ఉంది. మన దేశంలో సగటున ఒక్కొక్కరు రూ.8200 కోట్లు ఖర్చుచేస్తున్నారు. అతి తక్కువగా ఖర్చుచేస్తున్న దేశంగా కిరిబితి దేశం నిలిచింది. ప్రజలు తమ జేబుల్లో నుంచి ఖర్చు చేసే విషయంలో తెలంగాణ రూ.2263 కోట్లు అయితే.. ఏపీలో అంతకంటే తక్కువగా రూ.1699 కోట్లు మాత్రమే కావటం గమనార్హం.
ప్రజారోగ్య బీమాకు సంబంధించి తెలంగాణ పదో స్థానంలో నిలిస్తే.. ఏపీ మాత్రం అందుకు భిన్నంగా రెండో స్థానంలో నిలిచింది. ఆరోగ్య శ్రీ కింద తెలంగాణ ప్రభుత్వం రూ.300 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేస్తోంది. ఏపీ విషయానికి వస్తే రూ.1305 కోట్లు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఖర్చు చేస్తూ రెండోస్థానంలో నిలిచింది. ఇక.. దేశంలో అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద రూ.1467 కోట్లను ఖర్చుచేయటం గమనార్హం.