Begin typing your search above and press return to search.

కరోనాకి కొత్త చికిత్స కనుగొన్న తెలుగు సైంటిస్ట్!

By:  Tupaki Desk   |   22 Nov 2020 10:30 AM GMT
కరోనాకి కొత్త చికిత్స కనుగొన్న తెలుగు సైంటిస్ట్!
X
ప్రపంచానికి చీడ పురుగులా పట్టి , నాశనం చేస్తున్న కరోనా మహమ్మారి చికిత్స కి సరికొత్త మార్గం కనిపెట్టారు తెలంగాణకు చెందిన సైంటిస్ట్‌ డాక్టర్‌ తిరుమల దేవి కన్నెగంటి. వైరస్ బాధితుల గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలు ఫెయిల్ కాకుండా అడ్డుకునేందుకు ఓ కొత్త చికిత్స విధానాన్ని కనిపెట్టారు. కరోనా పేషెంట్లలో ఇమ్యూన్ సిస్టం ఓవర్ గా రియాక్ట్ కావడం వల్ల లంగ్స్, ఇతర అవయవాలు ఫెయిల్ అయి ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే.. కరోనా పేషెంట్లలో ఆర్గాన్స్ ఫెయిల్ కాకుండా అడ్డుకోవడంపై అమెరికాలోని మన తెలంగాణ సైంటిస్ట్ డాక్టర్ తిరుమల దేవి కన్నెగంటి ఆధ్వర్యంలోని టీమ్ ఫోకస్ పెట్టింది.

కరోనా వల్ల అవయవాలు ఫెయిల్ అయ్యేందుకు దారితీసే సెల్ డెత్ సిగ్నలింగ్ పాత్ వే గుట్టును పూర్తిగా తెలుసుకున్నది. ఇందులో ప్రత్యేకించి వైరస్‌ కారణంగా కొన్ని కణాలు మరణిస్తున్నాయని కనుగొన్నారు. ఈ కణాల మరణం వల్ల ఇతర అవయవాలు దెబ్బ తింటున్నాయని ఆమె గుర్తించారు. కణాల మరణానికి కారణమవుతున్న సైటోకైనిన్‌ లను సైతం ఆమె గుర్తించగలిగారు. ఈ పరిశోధన వల్ల నిర్ణీత సమస్యకు కచ్చితమైన సమాధానం కనుగొనవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కరోనాకు మాత్రమే కాకుండా సెప్సిస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు ట్రీట్ మెంట్ చేసేందుకు కూడా వీరి స్ట్రాటజీతో వీలవుతుందని చెప్పారు.

ఇకపోతే , డాక్టర్ తిరుమల దేవి అమెరికా టెన్నిసీ స్టేట్ మెంఫిస్ సిటీలోని సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ లో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇమ్యునాలజీ వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఈమె ఆధ్వర్యంలోని టీమ్ ఎలుకలపై చేసిన రీసెర్చ్ వివరాలు ఇటీవల సెల్ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి. కరోనా పేషెంట్లలో కీలక అవయవాలు ఫెయిల్ అవుతుండడానికి సెల్ డెత్ పాత్ వేలు కీలకమని వీరు ఎలుకలపై జరిపిన రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నారు. అవయవాలు ఫెయిల్ అయ్యేందుకు కారణమైన సెల్ డెత్ పాత్ వేస్ ను, వాటి పనితీరును అర్థం చేసుకోవడం వల్ల సమర్థమైన చికిత్సలకు వీలు కలుగుతుంది. సెల్ డెత్ పాత్ వేలను యాక్టివేట్ చేసే ప్రత్యేక సైటోకైన్స్ ను కూడా మేం గుర్తించినం. సైటోకైన్స్ ను కంట్రోల్ చేయడం ద్వారా కరోనాతో పాటు సెప్సిస్, ఇతర ప్రాణాంతక వ్యాధులను అడ్డుకునేందుకు వీలు కానుందని ఆమె తెలిపారు.