Begin typing your search above and press return to search.
తెలుగు మీడియా రిపోర్టర్ కి కరోనా పాజిటివ్!
By: Tupaki Desk | 2 May 2020 1:30 PM GMTకరోనా వైరస్ ..ఈ మహమ్మారి ప్రభావం ప్రతి రంగం పై పడింది. సామాన్య ప్రజలతో పాటుగా కరోనా పై పోరు ప్రకటించి ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్యులకు , ప్రజల కోసం ప్రాణాలని పనంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకి , సంబంధిత సిబ్బంది ..ఇలా వరుసగా కరోనా భారిన పడుతున్నారు. ఇక ఇప్పుడు తెలుగు మీడియాను కరోనా వైరస్ పట్టుకుంది. తాజాగా ఓ తెలుగు రిపోర్టర్ కరోనా భారిన పడ్డారు.
అయితే , ఢిల్లీలో ప్రముఖ న్యూస్ చానల్ కి రిపోర్టర్ గా పని చేస్తున్న ఒక వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూండటంతో టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో అతనికి కరోనా పాజిటివ్ గా తేలడంతో వెంటనే ఐసోలేషన్ కు తరలించారు. ఆ వ్యక్తి తో కాంటాక్ట్ లో ఎవరెవరు ఉన్నారు అని ఢిల్లీ అధికారులు ఆరా తీస్తున్నారు. సహజంగా ఢిల్లీలో ఉండే తెలుగు మీడియా పేపర్లు, చానళ్ల ప్రతినిధులంతా కలసి ఉంటారు. ఏ కార్యక్రమమైనా కలిసే వెళ్తారు. దాంతో ఆ రిపోర్టర్ కాంటాక్టుల్లో ఢిల్లీ తెలుగు మీడియా ప్రతినిధులంతా ఉన్నారని అంచనా వేస్తున్నారు.
ఆ రిపోర్టర్ కుటుంబాన్ని కూడా ఇప్పటికే క్వారంటైన్ కి తరలించి ...వారికీ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే , ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న మరికొంత మంది మీడియా ప్రతినిధులకూ.. వచ్చే రెండు రోజుల్లో కరోనా టెస్టులు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే , ఈ కరోనా సెగ ..కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి కూడా తగలబోతోంది అని తెలుస్తుంది. ఎందుకంటే… కిషన్ రెడ్డి ఢిల్లీలో ఏర్పాటు చేసిన కమాండ్ సెంటర్ బాధ్యతలు చూసుకుంటున్నారు. రోజూ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ తరుణంలోనే కరోనా పాజిటివ్ వచ్చిన రిపోర్టర్ కి దాదాపుగా మూడు సార్లు ఇంటర్యూ ఇచ్చినట్లగా తెలుస్తోంది. దీంతో కిషన్ రెడ్డి కూడా హోంక్వారంటైన్ కు వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తుంది.