Begin typing your search above and press return to search.
తెలుగు రాజకీయాలు గాడి తప్పుతున్నాయా...!
By: Tupaki Desk | 31 Oct 2022 2:30 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. రాజకీయాలు గాడి తప్పుతున్నాయా? ఒకప్పుడు ఎంతో ఆదర్శంగా ఉన్న తెలుగు రాష్ట్ర నేతలు.. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాలకు.. ఎన్నో రూపాల్లో ఆదర్శంగా ఉన్నారు.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేకుండా పోయిందా? అసలు రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఇదీ.. ఇప్పుడు మేధావులు చేస్తున్న ఆలోచన. ఎందుకంటే.. గత కొన్నాళ్లుగా.. ఏపీ, తెలంగాణ రాజకీయాలు గాడి తప్పుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. వ్యక్తిగత విమర్శల నుంచి ఇళ్లలోని వారిని రోడ్ల మీదకు రావడం వరకు.. తెలుగు రాష్ట్రాల రాజకీయం దారణంగా మారింది.
ఏపీ విషయాన్ని చూస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు తన సతీమణిని అసెంబ్లీ సాక్షిగా అవమాన పరిచారని.. పేర్కొంటూ..కన్నీరు పెట్టుకున్నారు. ఇది రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. ఏకంగా... ఆయన అసెంబ్లీకే రానంటూ.. శపథం చేసిన పరిస్థితిని చూశాం. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూ డు పెళ్లిళ్ల వివాదం.. రోడ్డున పడింది. ఈ క్రమంలో వైసీపీ నాయకులు.. ఆయన కుటుంబంపై విమర్శలు చేశారని.. జనసేన ఆరోపించింది. ఇదిలావుం టే.. ఇటీవల చెప్పు చూపిస్తూ.. పవన్ చేసిన .. కొడకల్లారా.. కామెంట్లు మరింత పరాకాష్టకు రాజకీయాలను చేర్చాయి.
ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు.. కేసీఆర్ ఆద్యుడనే చెప్పాలి. సన్నాసులు.. అనే పదంతో మొదలు పెట్టి బేవకూఫ్ గాళ్లు.. అంటూ.. ఆయన వాడిన పదజాలం తర్వాత.. నాయకులకు.. ఒక దిశానిర్దేశం అన్నట్టుగా మారి.. ఇక, వ్యక్తిగత విమర్శలు.. సవాళ్లు.. ఇలా.. రాజకీ యాలు మరో మలుపు తిరిగాయి.ఇక, తాజాగా.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వివాదం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను.. మరింత తారస్థాయికి తీసుకువెళ్లింది. ఇది ఎటు మలుపు తిరుగుతుందో తెలియదు కానీ.. దేశవ్యాప్తంగా తెలంగాణ ఇష్యూ మాత్రం తీవ్ర దుమారం అయితే రేపింది.
దీంతో అసలురెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం ఇంత దారుణంగా మారుతుందని అనుకోలేదని.. పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వ్యక్తిగత విమర్శలు ఉండేవికాదు. కానీ, ఇప్పుడు అవి లేకుండా.. రాజకీయాలు లేవు. తాజాగా.. పవన్ కళ్యాణ్ కూడా.. ఈ దారిలోకే వచ్చేశారనే వాదన వినిపిస్తోంది. అంతో ఇంతో ఒకింత.. పవన్ నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేస్తున్నాడని.. అనుకుంటున్న సమయంలో ఆయన బ్లాస్ట్ అయిపో యాడు. అదేసమయంలో మంత్రులపైనా.. ఆయన రెచ్చిపోయాడు. సో.. ఈ పరిణామాలు చూస్తే.. ఒకప్పటికి.. యూపీ రాజకీయాలను తలపిస్తున్నాయని అంటున్నారు. మరి ఎటు దారి తీస్తాయో చూడాలి.